ప్రస్తుతం అంతా లే ఆఫ్ కాలం నడుస్తోంది.ప్రభుత్వం ఉద్యోగం పక్కకు పెడితే, ప్రైవేటు ఉద్యోగాలు ఎప్పుడు అంటాయో ఎప్పుడు ఊడిపోతాయే చెప్పలేని పరిస్థితి. అమెరికా, యూకేలో ఆర్థిక మాద్యం వల్ల సాప్ట్వేర్ ఉద్యోగాలు పీకేస్తున్నారు. ఈ కఠిన సవాల్ ను తట్టుకునేందుకు ఓ మంచి ఇన్సురెన్స్ ఉంది. ఈ ఇన్సు రెన్స్ తీసుకున్న వారికి ఉద్యోగం పోతే వీరు జీతం ఇస్తారు.
ప్రైవేటు సెక్టారులో లక్షల జీతం తీసుకునే వారికి టెన్షన్ పట్టుకుంది. ఎప్పుడు ఉద్యోగం పోతుందో భయం భయంతో బతుకుతున్నారు. లగ్జరీ లైఫ్ ని అనుభవించి ఒక్కసారిగా ఉద్యోగం ఊడితే, ఈఎంఐలు ఎలా కట్టుకోవాలి, కుటుంబాన్ని ఎలా పోషించాలానే ఆందోళన వెంటాడుతోంది. అలాంటి వారిని జాబ్ లాస్ ఇన్స్యూరెన్స్కవర్ ఆదుకుంటుంది.
ఈ జాబ్ లాస్ ఇన్స్యూరెన్స్ కవర్ గురించి చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఇన్స్యూరెన్స్ పాలసీలు ఎక్కువగా లేకపోవడమే. కేవలం కొన్ని ప్రైవేట్ బీమా కంపెనీలు మాత్రమే ఈ ఇన్స్యూరెన్స్ అందిస్తున్నాయి. కొన్ని ఇన్స్యూరెన్స్ కంపెనీలు వీటిని యాడ్ ఆన్ పాలసీల లాగా అందిస్తున్నాయి. కొంత మొత్తం ప్రీమియం చెల్లిస్తే, ఉద్యోగం కోల్పోయిన సందర్భంలో కొన్ని నెలల పాటు వారి వేతనానికి సమానంగా ప్రతీ నెలా ఇన్స్యూరెన్స్ కంపెనీ డబ్బులు చెల్లిస్తుంది.
ప్రభుత్వం తరపున కూడా ఇలాంటి పథకాలు ఉన్నాయన్న సంగతి కొద్దిమందికే తెలుసు. అలాంటి పథకాల్లో రాజీవ్ గాంధీ శ్రామిక్ కళ్యాణ్ యోజన పథకం ఒకటి. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఈ పథకాన్ని రూపొందించింది. పారిశ్రామిక వివాదాల చట్టం, 1947 కింద నిర్వచించినట్టుగా ఓ వ్యక్తి నిరుద్యోగిగా మారితే, వారికి గరిష్టంగా 24 నెలల వరకు ఈ పథకం నిరుద్యోగ భృతిని అందిస్తుంది.
ఇక ఈఎస్ఐసీ నుంచి అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకం కూడా ఉంది. ఈ పథకంలో ఉన్న వ్యక్తి ఉద్యోగం కోల్పోతే మూడు నెలలు ప్రభుత్వం నుంచి వేతనం పొందొచ్చు. అయితే జీవితంలో ఒకసారి మాత్రమే ఈ బెనిఫిట్ లభిస్తుంది. ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారు వీటి గురించి ఆలోచిస్తే మంచిదనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.