సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయని విషయం మనకు తెలిసిందే. అయితే కొన్నిసార్లు మనం ఈ కష్టాల నుంచి బయటపడటం కోసం ఎంత కష్టపడి పని చేసినప్పటికీ చేతిలో ఒక రూపాయి కూడా నిలవకుండా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు మనల్ని చుట్టుముడుతుంటాయి. ఇలా ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఎంతో ఇబ్బందులు పడే వారు కొన్ని రకాల మొక్కలను ఇంట్లో నాటడం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడవచ్చని వాస్తు శాస్త్రం చెబుతుంది. మరి ఆ మొక్కలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
సాధారణంగా మన ఇంటి ఆవరణంలో ఎన్నో రకాల మొక్కలను నాటుతాము అయితే కొన్ని ఆహ్లాదకరంగా ఉండడానికి నాటక మరికొన్ని వాస్తు పరంగా అనుకూల వాతావరణాన్ని కల్పించడానికి నాటుతుంటారు.అయితే మన ఇంటి ఆవరణంలో మనీ ప్లాంట్ ఉండటం వల్ల మన ఇంటిపై పాజిటివ్ ఎనర్జీ ఉండటమే కాకుండా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అదేవిధంగా శమీ వృక్షాన్ని ఇంటి ప్రధాన ద్వారం ఎడమవైపు, దానిమ్మ మొక్కను నాటడం వల్ల ఆ ఇంటిలో ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు.
మన ఇంటి ఆవరణంలో దానిమ్మ చెట్టు ఉండటం వల్ల లక్ష్మీదేవి కుబేరుడిని ఆవహించి మనకు సిరిసంపదలను కలిగిస్తుంది.ఇక ఇంటి వెనుక భాగంలో అరటి చెట్టు ముందు భాగంలో బిల్వపత్ర చెట్టు ఉండటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది.పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఈ బిల్వపత్రి చెట్టు ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉండటం వల్ల మన ఇంటిపై అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడి ఇంట్లో సుఖసంతోషాలను కల్పించడమే కాకుండా సిరిసంపదల పెరుగుదలకు దోహదపడతాయి.