Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. సినిమా హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇకపోతే హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ కుబేర. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ఈనెల 20వ తేదీన విడుదల కానుంది.
ఇది ఇలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా ఫ్రీ రిలీజ్ వేడుకలు నిర్వహించారు మూవీ మేకర్స్. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ సుమ డైరెక్టర్ శేఖర్ కమ్ముల,రష్మిక మందన,ధనుష్ లతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ క్రమంలోనే తన మనసులో మాట బయటపెట్టారు హీరో ధనుష్. తెలుగులో ఏ హీరోతో సినిమా చేయాలనుకుంటున్నారని యాంకర్ సుమ అడగగా.. ధనుష్ మాట్లాడుతూ.. నేను పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనుకుంటున్నాను అని తెలిపారు.
అలాగే డబ్బు లేకపోయినా మనకు దక్కేది ఏంటీ అని అడగ్గా అమ్మ ప్రేమ అని చెప్పారు. రూ.150 సంపాదిస్తే రూ.200కు సమస్యలు ఉంటాయని, కోటి సంపాదిస్తే రూ.2 కోట్లకు సమస్యలు ఉంటాయని ఇది ప్రతి ఒక్కరికి కామన్ ప్రాబ్లం అని తెలిపారు ధనుష్. అనంతరం కుబేర వేడుక స్టేజ్ పై డ్యాన్స్ చేసి అదరగొట్టారు ధనుష్. అయితే ఈ సందర్భంగా ధనుష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ధనుష్ కాంబినేషన్లో సినిమా వస్తుందేమో చూడాలి మరి. ఇకపోతే కుబేర సినిమా విషయానికి వస్తే ఇప్పటికే విడుదలైన టీజర్ పోస్టర్లకు ప్రేక్షకులు నుంచి భారీగా స్పందన లభించింది. ఈ సినిమాను తెలుగు తమిళ మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు మూవీ మేకర్స్. విడుదలకు మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.