ఇలా శృంగారంలో పాల్గొంటే పిల్లలు పుట్టరా…. ఇందులో నిజమెంత?

చాలామంది భార్య భర్తలు పెళ్ళైన తర్వాత అప్పుడే పిల్లలు వద్దని గర్భనిరోధాన్ని పాటిస్తూ ఉంటారు. అయితే చాలామంది గర్భనిరోధకమాత్రలు వేసుకోకుండా, అలాగే కండోమ్ ఉపయోగించకుండా శృంగారంలో పాల్గొంటారు. అయితే ఇలాంటివి ఉపయోగించడం వల్ల భవిష్యత్తులో సమస్యలు వస్తాయని కంగారు పడుతుంటారు. అయితే ఇలాంటివి వాడకుండా సహజ పద్ధతిలో నిర్వహించాలంటే ఉన్నటువంటి ఏకైక మార్గం పురుషుడి వీర్యాన్ని స్త్రీ గర్భాశయంలోకి పంపించకుండా గర్భాన్ని నిరోధించాలని భావిస్తారు. నిజంగానే వీర్యాన్ని బయటకు వేయడం వల్ల గర్భం రాదా నిపుణులు ఏమంటున్నారంటే…

కలయికలో పాల్గొన్న సమయంలో… వీర్యాన్ని స్త్రీలోపల వదలకుండా… ఆ సమయంలో కరెక్ట్ గా బయటకు తీసేస్తారు.ఈ పద్ధతిని కోయిటస్ ఇంటర్‌ప్టస్ అని కూడా అంటారు. కోయిటస్ ఇంటర్‌ప్టస్ పద్ధతిలో శృంగారంలో పాల్గొనడం వల్ల 90 శాతం ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే స్కలన సమయంలో పురుషుడు చాలా అప్రమత్తంగా ఉంటేనే తమ వీర్యాన్ని బయటకు పంపించగలరు. ఇలా పంపించని తరుణంలో ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి.

ఇలా కలయికలో కండోమ్ లేకుండా పాల్గొంటారు. సరిగ్గా మీరు భావప్రాప్తికి చేరుకునే ముందు మీరు బయటకు తీయాలి. అయితే దీనికి చాలా కంట్రోల్ ఉండాలి.ఇలా సరేనా కంట్రోల్ లేనప్పుడు తప్పనిసరిగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నివేదికల ప్రకారం, గర్భాన్ని నివారించడంలో 98% విజయవంతమైన కండోమ్ వంటి జనన నియంత్రణ చర్యలతో పోల్చితే పుల్ అవుట్ పద్ధతి  ప్రభావం 78%గా ఉందనీ నిపుణులు చెబుతున్నారు.