తేనె తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఈ ప్రమాదకర సమస్యలు వచ్చే అవకాశం?

jar-of-honey-getty-0322-2000

మనలో చాలామంది తేనెను ఎంతో ఇష్టంగా తింటారు. తేనె వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే పరిమితంగా తేనె తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఎక్కువ మొత్తంలో తేనె తీసుకోవడం వల్ల అదే స్థాయిలో నష్టాలు ఉన్నాయి. తేనె తరచూ తినేవాళ్లు ఈ విషయాల గురించి పూర్తిస్థాయిలో అవగాహనను కలిగి ఉండాలి. బీపీతో బాధపడే వాళ్లకు తేనె వల్ల లాభం కంటే నష్టం ఎక్కువని చెప్పవచ్చు.

రక్తపోటు సమస్యను తేనె మరింత పెంచే అవకాశం అయితే ఉంటుంది. తరచూ తేనె తినేవాళ్లను దంత సంబంధిత వ్యాధులు వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. బ్రాండెడ్ కంపెనీల తేనెలను వాడే వాళ్లు ఆ తేనె ఒరిజినల్ తేనెనా? లేక కల్తీ తేనెనా? అనే విషయలను చెక్ చేసుకుంటే మంచిది. ఈ మధ్య కాలంలో ఎక్కువ కంపెనీలు కల్తీ తేనెలను విక్రయిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.

పరీక్షలకు సైతం దొరకకుండా షుగర్ సిరప్ లతో కొన్ని కంపెనీలు కల్తీ తేనెను తయారు చేస్తుండటం గమనార్హం. కల్తీ తేనెను తీసుకోవడం వల్ల షుగర్, ఇతర వ్యాధుల బారిన పడే అవకాశం అయితే ఉంది. నాణ్యతా ప్రమాణాలను అనుసరిస్తున్న కంపెనీల తేనెను మాత్రమే కొనుగోలు చేయడం ద్వారా ప్రజలకు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

తేనె ఎక్కువగా తీసుకుంటే శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. జీర్ణ సంబంధిత సమస్యలకు, దంత సంబంధిత సమస్యలకు తేనె కారణమయ్యే అవకాశం ఉంటుంది. చర్మం, జుట్టు, శరీర ఆరోగ్యానికి తేనె వల్ల మేలు జరుగుతుందని చెప్పవచ్చు.