ఈ లక్షణాలు మీలో ఉంటే భవిష్యత్తులో మీ రిలేషన్ షిప్ తెగిపోతుందని అర్థం!

ఏదైనా ఒక బంధం ఎక్కువ రోజులు నిలవాలంటే ఇద్దరి మధ్య ప్రేమానురాగాలతో పాటు ఆ బంధం పై సరైన
అవగాహన ఉండాలి. అప్పుడే ఆ బంధం ఎటువంటి వడిదుడుకులు లేకుండా పది కాలాలపాటు సాఫీగా సాగిపోతుంది. అలా కాకుండా ఒకరిపై ఒకరు పై చేయి సాధించుకునే విధంగా మీ మనస్తత్వం ఉంటే కొద్దిరోజుల్లోనే మీ రిలేషన్ బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే కొత్తగా రిలేషన్ కొనసాగించే ముందు అవతలి వ్యక్తి మనస్కత్వాన్ని వారి ఆలోచనలు, అలవాట్ల ద్వారా ముందుగానే గ్రహించి తగిన జాగ్రత్తలు పాటించాలి.

ఒక కొత్త రిలేషన్ ప్రారంభిస్తున్నప్పుడు మన పార్ట్నర్ గుణగణాలను, వ్యక్తిత్వ స్వభావాన్ని అంచనా వేయగలిగితే భవిష్యత్తు బాగుంటుంది. అలా కాకుండా గుడ్డిగా వారిని నమ్మి రిలేషన్ కొనసాగిస్తూ మధ్యలోనే ఏదైనా సమస్యలు తలెత్తితే ఆ బంధం నుంచి బయట పడాలంటే చాలా కష్టంగా ఉంటుంది.రిలేషన్ షిప్ మొదట్లో అవతలి వారి ఆలోచనలు అలవాట్ల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.నువ్వు నాకే సొంతం,నా అనుమతి లేనిదే వేరే వాళ్లతో మాట్లాడకూడదు వంటి నియంతృత్వ ఆలోచనలు ఉన్నట్లయితే ఇలాంటివి మొదట్లో బాగానే అనిపిస్తాయి కొన్ని రోజుల తర్వాత ఈ ఆలోచనలే మీకు మానసిక శాంతిని మీ స్వేచ్ఛను హరిస్థాయి అన్న విషయం తెలుసుకోండి.ఆ వ్యక్తితో మీ బంధం ఎక్కువ రోజులు కొనసాగదని ముందుగానే గుర్తించాలి

చిన్న చిన్న అనవసరపు విషయాలకే గట్టిగా అరవడం, కళ్ళు పెద్దవి చేసి చూడడం, చేతిలో ఉన్న వస్తువులు నెలకేసి కొట్టడం, చీటికిమాటికి చిరాకు కోపం తెచ్చుకోవడం వంటి లక్షణాలు మొదట్లోనే గుర్తిస్తే వారి నుంచి రిలేషన్ కోరుకోవడం మంచిది కాదు.అవతలి వారు మీకు తగిన గౌరవం ఇవ్వనపుడు ఎక్కువ ఆలోచించకండి. ఎందుకంటే భవిష్యత్తులో మీకంటూ ఎటువంటి గౌరవం, గుర్తింపు లభించదు. మీకు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే హక్కు కల్పించినప్పుడు మీరు ఆ రిలేషన్ లో ఎక్కువ రోజులు కొనసాగలేరు. తన గురించిన రహస్యాలను దాచిపెట్టి మీ గురించి ఏవి పట్టించుకోకుండా తిరిగే వారి పట్ల మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వారికి బంధాలపై ఎటువంటి గౌరవం ఉండదు. కాబట్టి ఇలాంటి వారిపై ఎక్కువ ప్రేమను పెంచుకోకుండా ఉండడమే మంచిది.