మీరు మీ భాగస్వామిని ప్రేమించడం, గౌరవించడం తప్పులేదు. అలాగని మీకు ఇష్టమైన విషయాలన్నీ మీ భాగస్వామికి ఇష్టం లేకపోయినా పాటించమనడం, జీవితాన్ని మీ చేతులతో నడిపించడం సరైన పద్ధతి కాదు. మీ భాగస్వామికి కూడా కొంత ఆలోచన స్వేచ్చని ఇవ్వడం మంచిది. చాలా మంది తమ భాగస్వామి విషయంలో చాలా పొసెసివ్ గా ఉంటారు. వారు ఎవరితో మాట్లాడినా తట్టుకోలేరు. మీ భాగస్వామి కూడా మీ విషయంలో పొసెసివ్ గా ఉంటారు అని అనడానికి ఈ కింది సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు.
తన జీవిత భాగస్వామి విషయంలో పొసెసివ్ గా ఉండేవారు తమ భార్య ,భర్తను ప్రతి విషయంలోనూ కంట్రోల్ చేయాలి అని అనుకుంటూ ఉంటారట. వారు చేసే చిన్న పనులను కూడా కంట్రోల్ చేయాలని చూస్తాడు.చివరికి తినే తిండి విషయంలోనూ
వేసుకునే డ్రెస్సుల విషయంలోనో తాను చెప్పినట్లే నడుచుకోవాలంటే సూచిస్తుంటారు.మరీ ఎక్కువ పొసెసివ్ గా ఉండేవారు తమ పార్ట్ నర్ కి ప్రతి విషయంలోనూ పరిమితులు విధిస్తారు. మిమ్మల్ని ప్రతి విషయంలోనూ ఇంటికే పరిమితం చేయడం, బయటకు వెళ్లనివ్వకపోవడడం కూడా పొసెసివ్ కిందకే వస్తాయి.
మీ భాగస్వామి విషయంలో మరీ ఎక్కువ పొసెసివ్ గా ఉండేవారు మీ పై కొంచెం కూడా నమ్మకం ఉంచరు.మీ ఫోన్, సోషల్ మీడియా అకౌంట్స్, కాల్స్ అన్నీ నిత్యం రహస్యంగా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. మీరు తీసుకునే నిర్ణయాలను సైతం వారు మానిప్యూలేట్ చేయాలని చూస్తారు. మీ నిర్ణయాన్ని వారే మార్చుకునేలా మాట్లాడేస్తారు. వారు చెప్పాక.. మీ నిర్ణయాలు మీరు మార్చేసుకుంటారు.
తన భాగస్వామి విషయంలో పొసెసివ్ గా ఉండేవారు.ప్రతి నిమిషం తమ భాగస్వామి తమ వెంట మాత్రమే ఉండాలని అనుకుంటూ ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్లినా తాను కూడా తమ వెంటే ఉండాలని అనుకుంటారు.ఒక క్షణం కనిపించక పోయినా ఏవో కొంపలు మునిగినట్లు గాబరా పడి ఫోన్ చేస్తుంటారు.ఇలా ప్రతి నిమిషం మీ గురించే ఆలోచిస్తూ మీకంటూ ఓ లైఫ్, ప్రైవసీ లేకుండా చేస్తుంటారు