పెళ్లి చేసుకోబోయే వ్యక్తిలో ఈ లక్షణాలు తప్పనిసరి: నిత్యమీనన్

మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్ గా పరిచయమై కేవలం మలయాళంలో మాత్రమే కాకుండా తమిళం తెలుగు భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు నటి నిత్యమీనన్.అందం నటన అభినయానికి మారుపేరుగా నిలిచినటువంటి నిత్యమీనన్ కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ సందడి చేస్తున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె ఎన్నో విషయాల గురించి తెలియజేయడమే కాకుండా తన పెళ్లి గురించి, తనకు కాబోయే వ్యక్తి గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఈమె హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ఎంతగానో గౌరవిస్తానని తెలిపారు ఇక పెళ్లిపై కూడా తనకు ఎంతో నమ్మకం ఉందని వెల్లడించారు.ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ తన దృష్టిలో పెళ్లి అనేది కేవలం సామాజిక రక్షణ కోసం మాత్రమే చేసుకునే అంశం అంటూ తెలియచేశారు. అయితే ఇలా సామాజిక రక్షణ కోసమే పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఆ అవసరం తనకు లేదని తెలియజేశారు.

పెళ్లి అనేది కేవలం సామాజిక రక్షణ మాత్రమే కాకుండా అందులో మరో అంశం ఉందని భావించినప్పుడే తాను పెళ్లి చేసుకుంటానని అలాగే తనకు కాబోయే వ్యక్తి కూడా పెళ్లి అనేది కేవలం సామాజిక రక్షణ అని మాత్రమే కాకుండా అంతకుమించి వేరే కోణంలో ఆలోచించే వ్యక్తి అయి ఉండాలని ఈమె తెలిపారు.అలాంటి వ్యక్తి తనకు కనపడినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని ఈ సందర్భంగా నిత్యామీనన్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.