మంగళవారం ఆంజనేయ స్వామిని ఇలా పూజిస్తే జీవితమే మారిపోతుందట.. ఏం చేయాలంటే?

మనలో చాలామంది ఆంజనేయ స్వామిని ఎంతో భక్తితో పూజిస్తారనే సంగతి తెలిసిందే. హనుమంతుడిని పూజించడం ద్వారా కోరిన కోరికలన్నీ నెరవేరతాయని చాలామంది నమ్ముతారు. మంగళవారం రోజున ఉపవాసం చేయడం ద్వారా మనపై భగవంతుని ఆశీర్వాదం ఉంటుంది. హనుమంతుడిని పూజిస్తే సులువుగా లక్ష్యాలను సాధించే అవకాశం ఉంటుందని చాలామంది భావిస్తారు.

హనుమంతుడిని పూజించడం ద్వారా ధైర్యం, బలంతో పాటు సక్సెస్ కూడా సొంతమవుతుంది. ప్రతి మంగళవారం రోజున హనుమంతుడిని పూజించడంతో పాటు వ్రతం చేయడం ద్వారా సులభంగా అనుకూల ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. హనుమంతుడు కలియుగ దైవం అని భక్తులు భావిస్తారు. హనుమంతుడు నేటికీ భూమిపై తిరుగుతున్నాడని భక్తులు భావిస్తారు.

హనుమంతుడిని దర్శించుకోవడం ద్వారా జీవితంలోని కష్టాలు అన్నీ తొలగిపోతాయని హనుమంతుని భక్తులు ఫీలవుతారు. హనుమాన్ చాలిసాను క్రమం తప్పకుండా పూజించడం వల్ల అనుకూల ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. హనుమంతుడిని పూజించడం వల్ల అడ్డంకులు, ఇబ్బందులను సులభంగా తొలగించుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ప్రతికూల శక్తిని తొలగించే దేవుడు ఆంజనేయ స్వామి అని చాలామంది భావిస్తారు. ప్రతి మంగళ, శనివారాల్లో హనుమంతునికి నెయ్యి దీపం, తులసి దళాన్ని ఆంజనేయ స్వామికి సమర్పిస్తే మంచిది. ఆంజనేయునికి తమలపాకులను సమర్పించడం ద్వారా అనుకూల ఫలితాలు సొంతమవుతాయి. హనుమంతుడిని పూజించడం ద్వారా చేపట్టిన పనిలో సులువుగా విజయం సొంతమవుతుంది.

హనుమంతుడి ఆలయానికి వెళ్లి బెల్లాన్ని ప్రసాదంగా సమర్పించడం వల్ల మెరుగైన ఫలితాలు సొంతమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఆలయంలో భక్తులకు బెల్లాన్ని పంచి మిగిలిన బెల్లాన్ని కుటుంబ సభ్యులు స్వీకరించడం ద్వారా అనుకూల ఫలితాలు సొంతమవుతాయి.