నేల పైన కూర్చోవడానికి ఆలోచిస్తున్నారా ఈ విషయం కనుక తెలిస్తే ఇకపై పైన అసలు కూర్చోరు!

ఒకప్పుడు మనం ఏం పని చేయాలన్న నేలపై కూర్చొని పనిచేసేవారు కానీ ప్రస్తుత కాలంలో కింద కూర్చొని పనిచేయడానికి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో తినడం, రాయడం, చదవడం, టీవీ చూడడం వంటి రోజువారి పనులన్నీ కూర్చిలో లేక సోపాలో కూర్చుని చేస్తుంటాం. కానీ పూర్వపు రోజుల్లో మన పెద్దలు భోజనం చేయడం, చదువుకోవడం రాయడం వంటి పనులన్నీ నేల మీద కూర్చుని చేసేవారు దీనివల్ల మానసిక సామర్థ్యం, శారీరిక పుష్టి కలిగేదని అనేక అధ్యయనాల్లో స్పష్టమైనది. నేల పైన కూర్చుని చేసే పనిలో ఏకాగ్రత పెరుగుతుందని మన ఆయుర్వేద గ్రంధాల్లో స్పష్టంగా రాయబడింది. నేలపైన కూర్చోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మనం నేల పైన కూర్చుంటున్నాము అంటే మనకు తెలియకుండానే మన ఆరోగ్యానికి అవసరమైన కొన్ని
ఆసనాలు వేస్తున్నామని గుర్తుంచుకోవాలి.పద్మాసనం, సుఖాసనం ధ్యానానికి అనువైన పొజిషన్స్. ఈ ఆసనాలు మనస్సు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ భంగిమల్లో కూర్చోవడం వల్ల శరీరంలో ఆక్సిజన్ ప్రవాహం పెరుగుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. నేల పైన కూర్చుని చదవడం, రాయడం అలవాటు చేసుకుంటే నాడీ వ్యవస్థ ,మెదడు కండరాలు అభివృద్ధి చెంది మనలో ఏకాగ్రత సామర్థ్యం మెరుగుపడుతుంది. తద్వారా జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరుచుకోవచ్చు.

ప్రస్తుత కాలంలో భోజనం చేయాలంటే ప్రతి ఒక్కరికి డైనింగ్ టేబుల్ సౌకర్యం ఉంటుంది ఇక డైనింగ్ టేబుల్ లేని వారు కూర్చులో కూర్చొని లేదా సోఫాలపై కూర్చొని భోజనం చేస్తున్నారు. కానీ ఇలా భోజనం చేయడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి అనే విషయం తెలియదు. నేల మీద కూర్చుని భోజనం చేసేవారు కింద కూర్చొని భోజనం తినేటప్పుడు ముందుకు వెనుకకు వంచడం వల్ల పొట్ట కండరాలు ఉత్తేజితమై కడుపులో డైజెస్టివ్ ఎంజైమ్‌ల స్రావాన్ని పెంచి ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. నేలపైన కూర్చున్న ప్పుడు వెన్నెముక పొజిషన్ నిటారుగా ఉండి అధిక ఒత్తిడి ఉండదు కావున భవిష్యత్తులో వెన్నెముక సమస్యలు తలెత్తవు. అందుకే నేలపై కనుక కూర్చోవలసి వస్తే మొహమాటం లేకుండా కూర్చుని మన రోజు వారి కార్యక్రమాలను పూర్తి చేయడంలో ఏమాత్రం తప్పులేదని పైగా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.