సాధారణంగా దంతాలు తెల్లగా మరియు మెరుస్తుండేలా ఉంచుకోవడం చాలా మందికి ఇష్టం. కానీ, తెల్లగా ఉండే మెరిసేటి దంతాల కోసం నోటి ఆరోగ్య సంరక్షణ చాలా ముఖ్యం.
దంతాలు పసుపు రంగుగా మారడానికి కాఫీ, సోడా ఇంకా మౌత్ వాష్ లు చాలా వరకు కారణం. వీటికి దూరంగా ఉండటం మంచిది. నిమ్మ, ఉప్పు మిశ్రమాన్ని ఉపయోగిస్తే దంతాలు తళ తళ మెరుస్తాయి. నిమ్మలో సీట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఈ రెండిటితో రెగ్యులర్ గా బ్రష్ చేసుకోవడం వలన పళ్ళపై ఉన్న పసుపు వర్ణం తొలగిపోతుంది.
మనం వినియోగించే బ్రష్ ను రెండు నెలకు మించి వాడకూడదు. రెండు నెలల తర్వాత బ్రష్ పై కఠినత్వం పెరిగి అది పళ్లపై ఉన్న ఎనామిల్ ను పాడుచేస్తుంది. దీని ద్వారా పళ్ళపై మరకలు ఏర్పడతాయి. తగినంత కాల్షియంను తీసుకోవడం వలన అది దంతాల పట్టిత్వమును గట్టిపరుస్తూ వాటి అమెరికా నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది.
పుదీనా తో తయారైన టూత్ పేస్ట్ ను వినియోగించడం వల్ల అది అప్పుడు రిజల్ట్ చూపించకపోయినా కాలక్రమమైన ఫలితం ఉంటుంది. టాయిలెట్ కు బ్రష్ ను కనీసం 6 అడుగుల దూరంలో ఉంచాలి. అప్పుడే వాటిపై బ్యాక్టీరియా వంటివి రాకుండా ఉంటాయి. అయితే కొందరికి జన్యుపరంగా అంటే వంశపారంపరంగా పళ్ళు అనేవి పసుపు రంగుగా వస్తూ ఉంటాయి అప్పుడు సరియైన వైద్యుని సంప్రదించడం మంచిది.
నోటిలో నూనెను వేసి పుకిలించడం వలన నోటిలోని సూక్మ జీవులు, బ్యాక్టీరియా వంటివి తొలగిపోతాయి. దీనినే ఆయిల్ పుల్లింగ్ అంటారు. నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో 10 నుంచి 15 నిమిషాలు పుకలించి ఉమ్మినట్లయితే చిగుళ్ళు ఇంకా దంతాల మధ్యలో ఉన్న బ్యాక్టీరియా తొలగిపోతుంది.
కమలకాయ తొక్కు, టమాటాలను మిక్సీ వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత బ్రష్ పై వేసి కాస్త ఉప్పు వేసి బ్రష్ చేసుకోవాలి. దీని ద్వారా మంచి ఫలితం ఉంటుంది. తర్వాత మనం సాధారణంగా చేసే విధంగా బ్రష్ చేసుకోవాలి.