జుట్టు సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ ఆకుతో శాశ్వత పరిష్కారం..

ఇటీవల కాలంలో ప్రధానంగా అందరూ ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలడం, బట్టతల రావడం, ఇంకా చుండ్రు రావడం. సరియైన నిద్ర ఇంకా కొన్ని పోషకాహార లోపాల వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. అయితే ఈ సమస్యలకు కరివేపాకు ద్వారా శాశ్వత పరిష్కారం ఉందని అంటున్నారు కొందరు నిపుణులు. ఇంతకు కరివేపాకుతో ఏం చేయాలో తెలుసుకుందాం.

కొంత కరివేపాకును నీటితో కలిపి మిక్సీ లో వేసి రసం లాగా చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు రసం ను వడబోసి ఒక ఖాళీ స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి. జుట్టు కుదుళ్లలో స్ప్రే చేసుకుని చేతివేళ్లతో చిన్నగా మర్దన చేసుకోవాలి. ఇలా 10 నుంచి 15 నిమిషాల వరకు చేసుకున్నట్లయితే జుట్టు రాలడం తగ్గి జుట్టు బాగా పెరగడం జరుగుతుంది.

వారానికి రెండు లేదా మూడుసార్లు ఇలా మర్దన చేసుకోవాలి. ఈ కరివేపాకు రసాన్ని ఒక డబ్బాలో కూడా భద్రపరచుకొని రోజు వాడుకోవచ్చు. కరివేపాకు లేత ఆకులను పచ్చిగా రోజుకు పది నుంచి 15 వరకు తిన్నట్లయితే కరివేపాకులోని యాంటీ ఆక్సిడెంట్ పీరియాడిక్సును కంట్రోల్ చేసి జుట్టు ఎదుగుదలకు దోహదపడుతుంది. జుట్టు పలచగా లేకుండా బలంగా ఉంటుంది.

అలాగే తెల్ల జుట్టుతో బాధపడేవారు మెంతుల పొడిని, కరివేపాకు ను మిక్సీ వేసుకోవాలి. ఒక గిన్నెలో రెండు స్పూన్ల కొబ్బరి నూనె ఒక స్పూన్ ఆముదం వేసి అందులో ఈ మిక్సీ వేసిన కరివేపాకు మిశ్రమాన్ని వేసి స్టవ్ ను లో ఫేమ్ లో ఉంచి పది నిమిషాలు వేడి చేయాలి. కింద మాడిపోకుండా పది నిమిషాలు అలాగే కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత ఆ మిశ్రమం చల్లారిన తర్వాత దానిని వడగట్టుకోవాలి. దీనిని వారానికి రెండు లేదా మూడుసార్లు తలకు పట్టించినట్టయితే తెల్ల జుట్టు రాకుండా జుట్టు ఎదుగుదల, జుట్టు బలంగా ఉంటూ చుండ్రు సమస్యలు దూరం అవుతాయి.