ఈ మధ్యకాలంలో చాలామంది చుండ్రు సమస్యతో బాధపడుతుంటారు. స్నానం చేసేటప్పుడు తలను శుభ్రంగా కడగకుండా ఏదో ఒక షాంపూ వేసి పై పైన కడిగి మేము రోజు తలస్నానం చేస్తాం అయినా మాకు చుండ్రు వస్తుంది అంటూ బాధపడుతుంటారు.
తలను శుభ్రంగా కడగకపోవడం వల్ల తలలో ఉండే చెమట అనేది కుదుళ్లలో ఫంగస్ లాగా పొరలు పొరలుగా ఏర్పడి దురద పుట్టి ఇరిటేట్ చేస్తుంది. భుజాలపైన మెడ పైన పొట్టు లాగా రాలి పడుతుంది. దీని ద్వారా ఎక్కువగా ఇరిటేషన్ కు గురి అవుతుంటారు. తలలో దురద అనేది విపరీతంగా ఉంటుంది.
చుండ్రు ను శాశ్వతంగా తగ్గించుకోవాలంటే కీటకనాజోల్ పేస్ట్, జెడ్ పి టి ఓ, ఓలమైన్ కాంబినేషన్లో వచ్చే షాంపులను కచ్చితంగా రెండు నెలల కోర్స్ పూర్తి చేయవలసి ఉంటుంది. కొద్ది రోజులు వాడి ఇస్తే పరిష్కారం ఉండదు. రెండు నెలల వరకు ఫంగస్ అయితే ఉంటుంది కాబట్టి కోర్స్ కంప్లీట్ చేస్తేనే రిజల్ట్ అనేది 100% వస్తుంది.
వేప ఆకు రసాన్ని కుదుళ్లకు బాగా పట్టించి కాసేపటి తర్వాత వేడి నీటితో కడగడం ద్వారా చుండ్రు సమస్య ఉండదు. తరువాత నిమ్మరసం ను తలకు పట్టించి అది ఎండిన తర్వాత స్నానం చేస్తే చుండ్రు సమస్య ఉండదు. పులిసిన పెరుగును మాస్కులాగా వేసుకొని ఒక గంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు అంతా పోతుంది.
మనం తలస్నానం చేసేటప్పుడు శుభ్రంగా కుదుల మధ్యలో వేళలో వేళ్ళతో షాంపూ లేదా కుంకుడుకాయ రసంతో బాగా మర్దన లాగా కాసేపు చేసి తరువాత స్నానం చేసినట్లయితే తలలో ఉన్న చెమట ఇంకా ఫంగస్ వంటివి పూర్తిగా తొలగిపోతాయి. ఎక్కువగా మార్కెట్లలో దొరికే షాంపూలను తక్కువ వాడుతూ ఇంటి చిట్కాలను వాడినట్లయితే చుండ్రు సమస్యలు జుట్టు రాలడం జుట్టు బలహీన పడమటి సమస్యలు దరి చేరవు.