భార్య భర్తలు ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకుంటే చాలు… ఇలాంటి గొడవలు ఉండవు!

relationships-teenagersnarrow

భార్యాభర్తల మధ్య అనుబంధం చక్కగా ఉన్నప్పుడు ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది ఆ కుటుంబం అభివృద్ధి చెందితే పిల్లల భవిష్యత్తు ఎంతో మెరుగ్గా తీర్చిదిద్దవచ్చు.భార్యాభర్తలు మధ్య వచ్చే చిన్న భేదాభిప్రాయాలే పెద్ద గొడవలకు దారితీసి బంధాన్ని తెగిపోయే వరకు లాగుతూ ఉంటాయి. అలా చేయడం మీ ఇద్దరికీ అంత మంచిది కాదు. ఎవరో ఒకరు ఆ క్షణం ఓపికగా ఉంటే సమస్య అంతటితో ఆగిపోతుంది.
దాంపత్య జీవితంలో భార్యాభర్తలు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే జీవిత కాలం పాటు ఎంతో ఆనందంగా జీవించవచ్చు. మీ ఆనందమైన జీవితానికి ముఖ్యంగా రెండు విషయాలను గుర్తు పెట్టుకోవాలి.

ఈ రోజుల్లో ఎక్కువ జంటలు విడిపోవడానికి ముఖ్య కారణం నేనే గొప్ప అనే గర్వం, అహంకారం ఈ ధోరణితోని చాలా జంటలు తమ బంధాన్ని మధ్యలోనే తెగదింపులు చేసుకొని విడిపోతూ తమ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. అలాకాకుండా ఏదైనా సమస్య వస్తే మొదట ఇద్దరు కూర్చుని చర్చించుకునే ప్రయత్నం చేయాలి. తప్పులను క్షమించే గుణం కలిగి ఉండాలి. కాబట్టి భార్యా భర్తలు ఒక మెట్టు దిగి ఇద్దరు కలిసి చర్చించుకోవడం ఒకరినొకరు అర్థం చేసుకుంటే మూడో వ్యక్తి ప్రమేయం అస్సలు అవసరం లేదు. మీ నిండు జీవితాన్ని సాఫీగా కొనసాగించవచ్చు.

భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు రావడానికి మరొక కారణం ఎవరి నిర్ణయాలు వారు సొంతంగా తీసుకోవడం, ఎవరు సంపాదన వారే ఖర్చు పెట్టుకోవడం, లేదా ఖర్చు పెట్టిన వాటికి లెక్కలు అడగడం వంటి కారణాలతో చాలామంది విడిపోతున్నారు. ఇలాంటి ధోరణి మీ దాంపత్య జీవితానికి అంత మంచిది కాదు.భార్యాభర్తలు ఎవరు ఎంత సంపాదించినా ఎంత ఖర్చు పెట్టినా సరే దాపరికం ఉండకూడదు. ఎలాంటి విషయాన్నైనా ఇద్దరూ కలిసి కూర్చొని చర్చించుకుంటే సరిపోతుంది. భర్త కుటుంబ అవసరాలను పట్టించుకుంటూ మీ పార్టనర్ పై ప్రేమానురాగాలు చూపిస్తే ఎటువంటి తగాదాలు తలెత్తవు. అలాగే భార్యలు కూడా భర్తకు గౌరవిస్తూ మెలిగితే నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో మీ బంధాన్ని కొనసాగించవచ్చు