భార్యాభర్తలు జీవితంలో సంతోషంగా ఉండాలంటే… ఇలా ఉండాల్సిందే!

modern-arranged-marriage

మనం ఒకసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత మన జీవితం ఆ వ్యక్తితో పది కాలాలపాటు సంతోషంగా ఉండాలని కోరుకుంటాము.ఇలా మన వైవాహిక జీవితం సంతోషంగా ముందుకు సాగాలి అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా కొన్ని విషయాలలో కొన్ని నియమాలు సూచనలు తప్పనిసరిగా పాటించాలి.ఇలా భార్యాభర్తలు ఇద్దరు కూడా కొన్ని నియమాలను పాటించడం వల్ల వారి వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందని ఆచార్య చానిక్యుడు తన నీతి గ్రంధం ద్వారా తెలియజేశారు.

ఆచార్య చాణిక్యుడి నీతి గ్రంధం ప్రకారం భార్య భర్తలు ఎలా ఉంటే వారి జీవితం సంతోషంగా ఉంటుంది. సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయానికి వస్తే… ఆచార్య చాణిక్యుడు నీతి గ్రంధం ప్రకారం భార్యాభర్తల సంతోషంగా ఉండాలి అంటే నమ్మకం అనేది తప్పనిసరిగా ఉండాలి. ఎప్పుడైతే భార్య భర్తల మధ్య నమ్మకం అనేది ఉంటుందో ఆ బంధం ఎక్కువ కాలం నిలబడుతుందని ఆదంపతులు సంతోషంగా ఉంటారని తెలిపారు. ఇలా నమ్మకం లేని చోట కొన్నిసార్లు అక్రమ సంబంధాలకు కూడా కారణం అవుతాయని చాణిక్యుడు తెలిపారు.

భార్య భర్తల మధ్య నమ్మకంతో పాటు అహంభావన కూడా ఉండకూడదు. అహం భావన వలన కూడా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడూ కూడా కష్ట సుఖాల్లోకి ఒకరికి ఒకరు తోడుగా ఉండి జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లాలి తప్ప అనవసరంగా ఇలా భార్యాభర్తల మధ్య నమ్మకంతో ఉంటూ అహం భావాన్ని తొలగించడం వల్ల వారి బంధం ఎంతో సంతోషంగా పది కాలాలపాటు కొనసాగుతుందని లేకపోతే వారి బంధం మధ్యలోనే తెగిపోయే అవకాశాలు ఉంటాయనీ చాణిక్యుడు తెలిపారు.