భార్య భర్తలు అన్న తర్వాత వారి మధ్య గొడవలు రావడం సర్వసాధారణం.వైవాహిక జీవితంలో ఎంతో అన్యోన్యంగా ఉండే భార్యాభర్తల మధ్య ఏదో ఒక విషయంలో చిన్నపాటి మనస్పర్ధలు తలెత్తుతూ ఉంటాయి అయితే ఇలాంటి మనస్పర్ధలు తలెత్తినప్పుడు ఎవరో ఒకరు ఒక అడుగు ముందుకు వేసి ఈ సమస్యను అంతటితో పరిష్కరించడానికి కృషి చేయాలి కానీ ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటూ ఆ చిన్న సమస్యను కాస్త సాగదీస్తూ పోతే సమస్య మరింత పెద్దది అవుతుంది. అందుకే భార్య భర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు ఈ మూడు విషయాలు కనుక పరిగణలోకి తీసుకొని వ్యవహరిస్తే అసలు గొడవలు ఉండవు.
మార్పు తప్పనిసరి:భార్యాభర్తల జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత కొన్ని సార్లు మనం పరిస్థితులకు అనుగుణంగా మన ఆలోచన ధోరణి మన వ్యవహార శైలిని మార్చుకోవాలి. అంతేకాకుండా నేను ఇలాగే ఉంటాను అని పట్టు పడితే మాత్రం సమస్యలు తప్పవు.
క్షమాపణలు: సమస్య చిన్నదైనా పెద్దదైన ఆ సమస్యను మరింత లాగకుండా భార్య లేదా భర్త ఇతరులు ఎవరో ఒకరు చేసిన తప్పుకు క్షమాపణలు చెబితే ఆ సమస్య అక్కడితో ముగుస్తుంది.
లోపాలు వెతక కూడదు: తప్పు అనేది మనకు తెలిసే తెలియకుండా జరగడం సర్వసాధారణం తప్పులు చేయని మనిషి ఉండరు. అయితే ఎప్పుడూ కూడా మనం చేసిన తప్పును లేదా మనలో లోపాలను వెతుకు కూడదు. ఇలా లోపాలను వెతుకుతూ ఉంటే ఇద్దరి మధ్య సమస్య ఎప్పటికీ తీరదు అందుకే ఈ విషయాల కనుక భార్యాభర్తలు గుర్తుంచుకుంటే వారి జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు.