Vijay Sethupathi: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్నారు హీరో విజయ్ సేతుపతి. కేవలం కోలీవుడ్ లో మాత్రమే కాకుండా టాలీవుడ్ లో కూడా భారీగా అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం హీరోగా అలాగే విలన్ గా నటిస్తూ దూసుకుపోతున్నారు. తెలుగు తమిళ హిందీ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించి తనదైన ముద్ర వేసుకున్నారు విజయ్ సేతుపతి. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి.
ఈ మధ్యకాలంలో విజయ్ నటించిన సినిమాలు మంచి విజయం సాధిస్తుండడంతో ఈయనకు వరుసగా అవకాశాలు వచ్చి చేరుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా హీరో విజయ్ సేతుపతి తన కొడుకు కారణంగా అభిమానులకు క్షమాపణలు తెలిపారు. అసలేం జరిగిందంటే.. విజయ్ సేతుపతి కొడుకు సూర్య హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. సూర్య నటించిన మొదటి సినిమా ఫీనిక్స్ జూలై 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు నుంచే ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక తండ్రిలాగే అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకున్నాడు సూర్య. అయితే ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీమియర్ షో ఇప్పుడు వివాదాస్పందంగా మారింది.
సూర్యకు సంబంధించిన వీడియోస్ డిలీట్ చేయాలని అతడి టీమ్ మీడియాపై ఒత్తిడి తెచ్చినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వివాదంపై విజయ్ సేతుపతి స్పందించారు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు నిజంగా అలాంటి ఒత్తిడి తెచ్చి ఉంటే అది తెలియకుండా జరిగి ఉండవచ్చు. లేదా వేరొకరు చేసి ఉండవచ్చు. ఈ విషయంలో ఎవరైనా బాధపడితే వారికి నా తరపున క్షమాపణలు చెబుతున్నాను అని విజయ్ సేతుపతి అన్నారు. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.