ప్రముఖ బ్యాంక్ ఐడీబీఐలో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. అత్యంత భారీ వేతనంతో?

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. మేనేజర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఐడీబీఐ అధికారిక పోర్టల్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలు కాగా డిసెంబర్ నెల 25వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

ఐడీబీఐ మేనేజర్ గ్రేడ్-బి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉద్యోగ ఖాళీల కోసం అర్హతల ఆధారంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 86 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగ ఖాళీలలో మేనేజర్ గ్రేడ్-బి విభాగంలో 46 ఉద్యోగ ఖాళీలు ఉండగా అసిస్టెంట్ జనరల్ మేనేజర్-39 ఉద్యోగ ఖాళీలు డిప్యూటీ జనరల్ మేనేజర్ ఒక పోస్టును భర్తీ చేయనున్నారు.

2023 సంవత్సరం నవంబర్ 1వ తేదీ సమయానికి 35 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌ ఉద్యోగ ఖాళీలకు 28 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లు అర్హులు కాగా మేనేజర్ పోస్ట్ కు మాత్రం 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నవాళ్లు అర్హత కలిగి ఉంటారు. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.

వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో మేలు చేకూరుతుండగా అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఐడీబీఐ బ్యాంక్ అధికారిక పోర్టల్ ద్వారా సులువుగా ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.