డిగ్రీ అర్హతతో ఐడీబీఐలో జేఏఎమ్ ఉద్యోగ ఖాళీలు.. అత్యంత భారీ వేతనంతో?

బ్యాంక్ ఉద్యోగ ఖాళీల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ప్రయోజనం చేకూరేలా ఐడీబీఐ తీపికబురు అందించింది. 500 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ లో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లామా ఫస్ట్ ఇయర్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. ఈ నెల 12వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ మొదలుకావడం గమనార్హం.

ఫిబ్రవరి నెల 26వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ణానంతో పాటు ప్రాంతీయ భాష పరిజ్ఞానం కూడా ఉండాలి.

2024 సంవత్సరం జనవరి 31 నాటికి 20 సంవత్సరాలు నిండిన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. గరిష్టంగా 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. ఎస్సీ ఎస్టీ, వికలాంగులకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు ఫీజు 200 రూపాయలు కాగా బీసీ, జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 1000 రూపాయలుగా ఉంటుంది. 2024 సంవత్సరం మార్చి 17వ తేదీన ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష జరుగుతుంది.

www.idbibank.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. విద్యార్హతలు, అనుభవం, గ్రూప్‌ డిస్కషన్‌,పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.