ఐడీబీఐ బ్యాంక్ లో 600 అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

Job-Vacancy

ప్రముఖ బ్యాంక్ లలో ఒకటైన ఐడీబీఐ బ్యాంక్ అదిరిపోయే తీపికబురు అందించింది. 600 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 3వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉండగా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. అసిస్టెంట్ మేనేజర్ విభాగంలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. అనుభవం ఉన్న ఉద్యోగులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది.

బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్ మరియు ఇన్సూరెన్స్ విభాగంలో రెండేళ్ల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఆన్ లైన్ టెస్ట్ కు హాజరై ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ కు హాజరు కావాల్సి ఉంటుంది. https://www.idbibank.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

వెబ్ సైట్ లో కెరీర్స్ ఆప్షన్ ను ఎంచుకుని ఆ తర్వాత కరెంట్ ఓపెనింగ్స్ అనే మరో ఆప్షన్ ను ఎంచుకుని అప్లై ఆన్ లైన్ అనే ఆప్షన్ ను ఎంచుకోవడం ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.