ప్రభుత్వ బ్యాంకుల్లో 4451 ఉద్యోగ ఖాళీలు.. అత్యంత భారీ వేతనంతో?

ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఉద్యోగ ఖాళీల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు అదిరిపోయే తీపికబురు వచ్చింది. 4451 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 11 ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలలో 3049 పీవో ఉద్యోగ ఖాళీలు ఉండగా 1402 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

ఆగష్టు 1వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఆగష్టు 21వ తేదీ వరకు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా అర్హత ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా బెనిఫిట్ కలుగుతుంది. పీవో, మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగ ఖాళీలు 3049 ఉండగా 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు.

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 175 రూపాయలు దరఖాస్తు ఫీజు కాగా మిగతా అభ్యర్థులకు 850 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉండనుంది. నోటిఫికేషన్ ద్వారా పరీక్ష తేదీలు, ఇతర వివరాలను సులువుగా తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుండగా ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుండగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వచ్చే ఏడాది ఏప్రిల్ సమయానికి ఇంటర్వ్యూలు పూర్తి కానున్నాయని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.