ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ బ్యాంకింగ్ సెలక్షన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో దాదాపు 10 వేల క్లర్క్, పీవో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ibps.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు ఏకంగా 5585 ఉన్నాయి.
స్కేల్-1 ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు 3499 ఖాళీలు ఉన్నాయని సమాచారం అందుతోంది. ఆగష్టు నెల 3వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మొదలుకానుండగా ఆగష్టు నెల 18వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారని సమాచారం అందుతోంది. ఐబీపీఎస్ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 850 రూపాయలు అని సమాచారం అందుతోంది. ఎస్సీ, ఎస్టీ, శారీరక వికలాంగ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 175 రూపాయలుగా ఉండనుందని సమాచారం అందుతోంది. జూన్ నెల 27వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుందని తెలుస్తోంది. అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉంటే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫీసర్ పోస్టులకు బ్యాచిలర్ డిగ్రీ సంబంధిత సబ్జెక్టులో ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. దేశంలోని 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో ఈ పోస్టుల భర్తీ జరగనుండగా 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆఫీసర్ కేటగిరీ పోస్టులకు వయో పరిమితి భిన్నంగా ఉంది.