నిరుద్యోగులకు తీపికబురు.. భారీ వేతనంతో 4045 బ్యాంక్ ఉద్యోగ ఖాళీలు!

ఐబీపీఎస్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. వేర్వేరు బ్యాంక్ లలో క్లర్క్ ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 4045 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. 11 ప్రభుత్వ రంగ బ్యాంక్ లలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కనీస కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.

28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుందని సమాచారం అందుతోంది. ప్రిలిమ్స్‌ 100 మార్కులకు మెయిన్స్ 200 మార్కులకు ఉండగా ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వాళ్లు మాత్రమే మెయిన్స్ లో అర్హత సాధించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర , ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ తో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని తెలుస్తోంది.

ఈ నెల 21వ తేదీ వరకు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. https://ibpsonline.ibps.in/crpcl13jun23/ లింక్ లో రిజిష్టర్ చేసుకోవడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఎక్కువ మొత్తం వేతనం లభించనుందని తెలుస్తోంది.