ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. ఈ సంస్థ నుంచి కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ కు సంబంధించి జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. 4,545 ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ లతో పాటు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
కంప్యూటర్ పరిజ్ఞానాన్ని కలిగి ఉండటంతో పాటు డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ మొదలు కాగా జులై 21వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుందని సమాచారం అందుతోంది. https://www.ibps.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
కంప్యూటర్ బేస్‌డ్ ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా రూ.47,920 వేతనం లభించనుందని సమాచారం అందుతోంది.
ఆగష్టు నెలలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్షలు జరగనున్నాయని సమాచారం అందుతోంది. 100 మార్కులకు ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనున్నారని తెలుస్తోంది. మెయిన్స్ ఎగ్జామ్ మాత్రం 200 మార్కులకు ఉంటుందని సమాచారం అందుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారని తెలుస్తోంది.