రాతపరీక్ష లేకుండానే ఇంటెలిజెన్స్ బ్యూరోలో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

న్యూఢిల్లీలోని ఇంటెలిజెన్స్ బ్యూరో నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పరీక్ష లేకుండా ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగం చేసే అవకాశాన్ని ఈ సంస్థ కల్పిస్తుండటం గమనార్హం. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. mha.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం 226 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ విభాగంలో 147 ఉద్యోగ ఖాళీలు ఉండగా కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో 79 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.

2021, 2022,2023 లో క్వాలిఫై అయిన అభ్యర్థులు సైతం ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు కాగా జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 200 రూపాయలుగా ఉంది. మిగతా అభ్యర్థులకు మాత్రం దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉండటం గమనార్హం.

గేట్ స్కోర్, ఇంటర్వ్యూ, ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 1,42,400 వరకు వేతనంగా లభిస్తుంది. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.