ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్-2024 జాబ్ నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. మొత్తం 150 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మార్చి 5వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. అటవీశాఖలో జాబ్ చేయాలని కోరుకునే వాళ్లు వెంటనే ఈ జాబ్ నోటిఫికేషన్ పై దృష్టి పెడితే మంచిది. ఐ.ఎఫ్.ఎస్ ఉద్యొగ ఖాళీల కోసం యూపీఎస్సీ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది.
యూపీఎస్సీ వెబ్ సైట్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. 32 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. నోటిఫికేషన్ ఆధారంగా సంబంధిత విభాగంలో డిగ్రీని కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు అని చెప్పవచ్చు. ఆన్‌లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష 2024 సంవత్సరం మే నెల 26వ తేదీ నుంచి జరగనుండగా మెయిన్ ఎగ్జామినేషన్ నవంబర్ 24వ తేదీ నుంచి జరగనుంది. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు అత్యంత భారీ వేతనం లభిస్తుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఒకింత భారీ స్థాయిలోనే పోటీ ఉండనుంది. యూపీఎస్సీ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుంది.