డిగ్రీ అర్హతతో ఇస్రోలో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. వేతనం ఎంతంటే?

భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ప్రయోజనం చేకూరేలా ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ అదిరిపోయే తీపికబురును అందించింది. జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ నెలలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన రాతపరీక్ష జరగనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికయ్యే అభ్యర్థులు తమకు కేటాయించిన పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఏడాదికి 3 నుంచి 3.5 లక్షల రూపాయల మధ్య వేతనం లభించనుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు బేసిక్ వేతనంతో పాటు ఆలవెన్స్ లు పొందే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు డియర్‌నెస్ అలవెన్స్, హౌస్‌రెంట్ అలవెన్స్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ పొందే అవకాశం ఉంటుంది. ప్రొబేషన్ పీరియడ్ ముగిసిన తర్వాత వేతనం పెరగడంతో పాటు ఇతర బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది.

మొత్తం 154 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 2022 సంవత్సరం డిసెంబర్ 20వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. సెప్టెంబర్ 24వ తేదీన రాత పరీక్ష, ఇంటర్వ్యూ రౌండ్ జరగనుండగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు ఇస్రో సెంటర్స్ లో పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు ఎక్కువ మొత్తంలో వేతనం లభించనుంది.

చంద్రయాన్3 సక్సెస్ తర్వాత ఇస్రోలో ఉద్యోగం సాధించాలని కోరుకునే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఇస్రోలో ఉద్యోగం సాధిస్తే కెరీర్ మరో రేంజ్ లో ఉండనుందని చెప్పవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే ఎంతగానో ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.