పది అర్హతతో ఎయిర్ పోర్ట్ లో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. కార్గో లాజిస్టిక్స్‌ అండ్‌ అలైడ్‌ సర్వీసెస్‌ కంపెనీ లిమిటెడ్‌ నుంచి భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తూ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి అర్హతతో ఈ ఉద్యోగ ఖాళీలు భర్తీ కానున్నాయి. ట్రాలీ రిట్రీవర్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆగష్టు 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీలకు మూడేళ్లు వయో సడలింపు ఉండగా మిగతా అభ్యర్థులకు మాత్రం మూడు నుంచి ఐదేళ్ల వరకు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 250 రూపాయలుగా ఉండనుందని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఫిజికల్‌ ఎఫిషియెన్సీ పరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని తెలుస్తోంది. https://aaiclas-ecom.org/live/career.aspx వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగానే ఉండనుందని సమాచారం అందుతోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుందొ.

ఎయిర్ పోర్ట్స్ అథారిటీలో ఉద్యోగ ఖాళీలు చేయాలని భావించే వాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. నిరుద్యోగులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే సులువుగా భారీ వేతనాన్ని పొందే అవకాశం ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.