ఆయిల్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 187 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. ఏప్రిల్ 25వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. గ్రేడ్ 3, గ్రేడ్ 5, గ్రేడ్ 7 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం 187 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తుండటంతో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉంది.
www.oil-india.com వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్ సైట్ లో కరెంట్ ఓపెనింగ్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఆ తర్వాత అప్లై అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. మొదట రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ను భద్రపరచుకుంటే మంచిది.
ఈ ఉద్యోగాలలో గ్రేడ్3 ఉద్యోగ ఖాళీలు 134 ఉండగా గ్రేడ్5 ఉద్యోగ ఖాళీలు 43, గ్రేడ్7 ఉద్యోగ ఖాళీలు 10 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీగానే వేతనం లభించనుంది. ఏప్రిల్ 25వ తేదీ చివరి తేదీగా ఉండటంతో అర్హత, అసక్తి ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఎంతగానో మేలు జరుగుతోంది.
https://www.oil-india.com/document/career/advt_27032023.pdf లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్ ప్రత్యక్షంగా, పరోక్షంగా నిరుద్యోగులకు ఎంతగానో ప్రయోజనం చేకూర్చుతోంది.