ఇండియన్ నేవీ నిరుద్యోగులకు బెనిఫిట్ కలిగేలా వేర్వేరు జాబ్ నోటిఫికేషన్లను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇండియన్ నేవీ నుంచి బిజినెస్‌మ్యాన్ చీఫ్ మేట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వరా నిరుద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. joinindiannavy.gov.in వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
26 ఆగస్టు 2023 నుండి ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ మొదలుకానుంది. సెప్టెంబర్ 25, 2023 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. joinindiannavy.gov.in వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవడంతో పాటు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి పది పాసైన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లు సంబంధిత పరిశ్రమలో ఐటీఐ సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది. రిజర్వ్డ్ అభ్యర్థులకు వయస్సుకు సంబంధించి సడలింపులు ఉండనున్నాయి. రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
100 మార్కులకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పరీక్షను నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఇండియన్ నేవీ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుండగా అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.