డిగ్రీ అర్హతతో కెనరా బ్యాంక్ లో భారీగా ఉద్యోగ ఖాళీలు.. వేతనం ఎంతంటే?

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన కెనరా బ్యాంక్ ఈ మధ్య కాలంలో వరుసగా జాబ్ నోటిఫికేషన్లను రిలీజ్ చేస్తూ నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్స్ కలిగేలా చేస్తుండటం గమనార్హం. డిగ్రీ అర్హతతో కెనరా బ్యాంక్ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. మొత్తం 500 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 21వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆ తేదీలోగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. https://ibpsonline.ibps.in/crppo13jun23/ వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. గుర్తింపు పొందిన బోర్డ్ లేదా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు.

30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పది సంవత్సరాలు సడలింపు ఉండనుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 175 రూపాయలు కాగా మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 850 రూపాయలుగా ఉండనుంది.

ఆన్ లైన్ విధానం ద్వారా అభ్యర్థులు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆగష్టు నెల 1వ తేదీన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 2023 సంవత్సరం ఆగష్టు 21వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉండనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుంది.