ఆ కారణం వల్ల విశాఖలో థియేటర్ అమ్మేసిన సురేష్ బాబు?

కరోనా తర్వాత థియేటర్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కరోనా సమయంలో థియేటర్లు మూతపడటం వల్ల ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటు పడి
ఓటీటీలలో సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే కరోనా తర్వాత థియేటర్లు తెరుచుకున్నప్పటికీ థియేటర్ కి వచ్చి సినిమాలు చూసే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఈ క్రమంలోనే మరోవైపు సినిమా టికెట్ల రేట్లు పెంచడం వల్ల ప్రేక్షకులు థియేటర్ కి రావడానికి ఇష్టపడడం లేదు. ఇలా ప్రేక్షకులు థియేటర్ కి రాకపోవడంతో చాలా థియేటర్లు ఇప్పటికీ మూతపడ్డాయి మరికొన్ని థియేటర్లను యజమానులు అమ్మడానికి కూడా వెనకాడటం లేదు.

ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా డిస్ట్రిబ్యూటర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేష్ బాబు విశాఖ నగరంలో అత్యంత సదుపాయాలు కలిగి ఉన్నటువంటి జ్యోతి థియేటర్ ను భారీ ధరకు అమ్మేసినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి జ్యోతి థియేటర్స్ విశాఖ నగరానికి చెందిన కొందరు వ్యాపారులు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం థియేటర్ ఉండటం వల్ల ప్రేక్షకులు పెద్దగా థియేటర్ కి రాకపోవడంతో సురేష్ బాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

నగరం నడి బొడ్డున ఉన్నటువంటి ఈ థియేటర్ అమ్మడం వల్ల ఈయన భారీగా లాభం పొందినప్పటికీ ఇలా డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా కొనసాగుతున్నటువంటి ఈయన థియేటర్ అమ్మేయడం అందరిని ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రేక్షకులు థియేటర్ కి రాకపోవడం వల్లనే థియేటర్లో ఎలా మూతపడుతున్నాయని మరికొందరు అమ్ముతున్నారని తెలుస్తోంది. ఇక ఈ థియేటర్ స్థానంలో 10 అంతస్తుల బిల్డింగ్ నిర్మించడానికి వ్యాపారులు సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి.ఈ విధంగా సురేష్ బాబు తన థియేటర్ అమ్ముకున్నారు అంటూ వచ్చే ఈ వార్తలలో ఇంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.