Petrol Pump: పెట్రోల్ బంక్ ద్వారా ప్రతినెల లక్షలు సంపాదించవచ్చు.. ఎలా అంటే?

ఇటీవల కాలంలో ఇతర రంగాలతో పోల్చుకుంటే ఎక్కువ శాతం మంది బిజినెస్ రంగం వైపు అడుగులు వేయడంతో బిజినెస్ చేయాలని ఆసక్తిని చూపిస్తున్నారు. ఇందుకోసం రకరకాల బిజినెస్ లను ఎంచుకుంటున్నారు. అందులో భాగంగానే కొందరు పెట్రోల్ బంక్ ని కూడా ఎంచుకుంటూ ఉంటారు. పెట్రోల్ పంప్ ఉండాలని కోరుకుంటారు. అయితే ఇది కూడా మంచి ఛాయిస్ అనే చెప్పాలి. భారతదేశంలో పెట్రోల్ డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ఫిబ్రవరిలో పెట్రోలు వినియోగం 19.72 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది. ఇది ఒక బలమైన ఆదాయ సోర్సెస్ కావచ్చు. అయితే పెట్రోల్ పంపు తెరవాలంటే ఏం చేయాలో చాలా మందికి తెలియదు.

ఏ విధమైన డీలర్‌షిప్ ఉంటుంది ? పెట్రోల్ బంక్ తెరవడానికి ఏమి చేయాలో తెలుసా? ఇందులో లాభ నష్టాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గ్రామీణ ప్రాంతంలో పెట్రోల్ పంపు తెరవాలంటే రూ.12 నుంచి 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అలాగే పట్టణ ప్రాంతాలలో రూ.20 నుంచి 25 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పెట్రోలు వ్యాపారంలో ఎంత ఎక్కువ అమ్మితే అంత లాభం అన్నది జరుగుతుంది. వాస్తవానికి పెట్రోల్ అమ్మకంపై లీటరుకు రూ.2 నుంచి 5 వరకు కమీషన్ లభిస్తుంది. నెలకు దాదాపు రూ.2 నుంచి 3 లక్షల వరకు ఆదాయం రావచ్చు.

పెట్రోల్ పంపును తెరవాలంటే దాదాపు 800 నుంచి 2000 చదరపు మీటర్ల స్థలం ఉండాలి. మీకు భూమి లేకపోతే, మీరు భూమిని లీజుకు కూడా తీసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం లేదా హిందుస్థాన్ పెట్రోలియం కోసం మీరు మొదట ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మీరు www.petrolpumpdealerchayan.in వెబ్‌సైట్ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అందులో అవసరమైన సమాచారం నింపాల్సి ఉంటుంది. దీని తర్వాత ఈ కంపెనీలు మిమ్మల్ని సంప్రదిస్తాయి. దీని కోసం ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికెట్, భూమి డాకుమెంట్స్ లేదా లీజు పేపర్స్, మున్సిపల్ కార్పొరేషన్ లేదా ఇతర ఆమోద పత్రాలు వంటి అవసరమైన డాకుమెంట్స్ అవసరం. అంతే కాకుండా, బ్యాంక్ స్టేట్‌మెంట్, ఆదాయపు పన్ను డాకుమెంట్స్ ఇంకా పర్యావరణ క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా అవసరం. ఇలా వీటన్నింటికి సంబంధించిన పనులు చూసుకునే మీరు పెట్రోల్ బంక్ ని మొదలు పెట్టవచ్చు.