సూపర్ టేస్ట్ గా ఉండే పొంగల్ ను ఇంట్లోనే తయారు చేసుకునే విధానం మీ కోసం..!

ఒక ప్రెజర్ కుక్కర్ లో ఒక కప్పు బియ్యం, అరకప్పు మినప్పప్పు వేసి రెండు లేదా మూడుసార్లు కడగాలి. తర్వాత అందులో ఐదు నుంచి ఆరు కప్పుల నీళ్లు పోయాలి. అందులో తగినంత ఉప్పు, 10 నుంచి 12 వరకు మిరియాలు, తరిగిన కొంచెం అల్లం, చిటికెడు పసుపు, రెండు చెక్క, రెండు ఇలాచీలను వేసి అందులో తగినంత కరివేపాకు ఆకులు ఇంకా ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా కలపాలి.

తర్వాత దీన్ని స్టవ్ పై ఉంచి మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత తీసి కలుపుతూ నీటిని దార లాగా పోయాలి. జోరుగా వచ్చేవరకు నీటిని కలపాలి. మరీ గట్టిగా కాకుండా మరీ చిక్కగా లేకుండా చూసుకోవాలి.ఒక బానీ తీసుకొని స్టవ్ పై పెట్టి అందులో ఒకటి లేదా రెండు స్పూన్ ల నెయ్యి వేసుకోవాలి.

తరువాత అందులో కొద్దిగా జిలకర, ఆవాలు, శనగ గింజలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. స్టవ్ ను లో ఫేమ్ లో ఉంచుకోవాలి. రెండు లేదా మూడు నిలువుగా కోసిన పచ్చిమిరపకాయలు మూడు లేదా నాలుగు ఎండు ఎర్రటి మిరపకాయలు, కొంచెం కాజు వేసి అవి బాగా వేగే వరకు తిప్పుతూ ఉండాలి.ఒక స్పూన్ బ్లాక్ పేపర్, కొద్దిగా ఇంగువ, కొంచెం కరివేపాకు ఆకులు వేసి మాడకుండా గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించాలి.

తరువాత ఈ మిశ్రమాన్ని మనం ఇంతకుముందు తయారు చేసుకున్న పొంగలిలో వేసి బాగా కలపాలి కలపాలి. ఇంకేముంది మనకు కావలసిన వేడివేడి పొంగలి తయారు అయిపోయినట్టే. చూశారుగా ఫ్రెండ్స్ ఇంట్లోనే చక్కగా రుచికరమైన పొంగలి తయారు చేసుకునే విధానం.