పిఎఫ్ విత్ డ్రా చేయటానికి కష్టపడకుండా ఆన్లైన్లో ఇలా ఈజీగా చేసేయండి..?

సాధారణంగా చాలామంది వారు సంపాదించిన డబ్బులు కొంత భాగం భవిష్యత్తులో అవసరాల కోసం వారికి నచ్చిన పథకాలలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఉద్యోగస్తులు కూడా తమ జీవితంలో కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం ఆదా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్‌ (ఈపిఎఫ్) పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. దీంతో ఉద్యోగస్తులు తమ ఆదాయంలో కొంత భాగాన్ని పిఎఫ్ ఖాతాలలో పొదుపు చేస్తూ ఉంటారు. వారికి అవసరమైన సమయంలో పీఎఫ్ ఖాతాల నుండి డబ్బును విత్ డ్రా చేసుకొని అవకాశం ఉంటుంది.

ఈపీఎఫ్‌ రాబడి, విత్‌డ్రా ప్రాసెస్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. EPFO విత్‌డ్రాకి ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చెయ్యచ్చనేది ఇప్పుడు తెలుసుకుందాం.

• EPFO ఖాతా నుండి డబ్బు విత్ డ్రా చేయటానికి దీనికి చెందిన e-SEWA పోర్టల్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ లో లాగిన్ అవ్వాలి.
• ఆ తరవాత యూనివర్సల్ అకౌంట్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చెయ్యండి.
• ఆ తరువాత మీరు ‘క్లెయిమ్ (ఫారం-31, 19 & 10సి)’ ఆప్షన్‌ ని సెలక్ట్ చేయాలి.
• ఇక ఇప్పుడు PF అకౌంట్‌ తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్‌ నంబర్‌ ని ఎంటర్‌ చేసి, వెరిఫై బటన్‌పై క్లిక్ చేయాలి.
• ఇక అక్కడ ఉన్న ప్రొసీడ్‌ ఫర్‌ ఆన్‌లైన్ క్లెయిమ్ మీద క్లిక్ చేయాలి.
• ఆ తరవాత ఐ వాంట్ టూ అప్లై ఫర్ మీద నొక్కి
క్లెయిమ్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి.
• ఇలా ఫారం సెలక్ట్‌ చేసుకున్నాక విత్‌డ్రా చేసేందుకు కారణం చెప్పండి.
• విత్‌డ్రా చేస్తున్న మొత్తం డబ్బు, అడ్రెస్‌ వివరాలు ఎంటర్‌ చేయాలి.
• ఆ తరువాత అప్లికేషన్‌ ప్రాసెస్‌ కంటిన్యూ చేసేందుకు ప్రొసీడ్‌ పై క్లిక్‌ చేయాలి. ఆన్లైన్ లో ఇలా చేయటం వల్ల 15 నుంచి 20 రోజులలోపు మీ బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ అవుతాయి.