కమ్మగా నోరూరించే వంకాయ రోటి పచ్చడి ఇంట్లో తయారు చేసుకునే విధానం!

ఒక పెద్ద వంకాయను తీసుకొని శుభ్రంగా కడిగి దానికి నూనె రాసి స్టవ్ ను లో ఫేమ్ లో ఉంచి ఆ మంటపై వంకాయను తిప్పుతూ అంత కాలేలా కాల్చుకోవాలి. వంకాయకు నూనె పూయడం ద్వారా తోలు అనేది సులువుగా తీయవచ్చు. వంకాయను డైరెక్ట్ గా అయినా, లేదంటే స్టాండ్ పై పెట్టి కాల్చుకోవచ్చు. వంకాయ అంతా కాలిన తర్వాత దానిని తీసి పక్కన పెట్టుకోవాలి.

తరువాత ఒక బాణీ తీసుకొని అందులో రెండు స్పూన్ల నూనె వేసి ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ ధనియాలు, అర స్పూను జీలకర్ర, అర స్పూన్ ఆవాలు వేసి లైట్ గా వేగిన తర్వాత అందులో కొన్ని పచ్చిమిరపకాయలు, ఇంకా పది నుంచి 15 వరకు ఎండు మిరపకాయలు వేయాలి. మీరు కావాలనుకుంటే రెండు మిరపకాయలలో ఏదో ఒక రకం వాడుకోవచ్చు.

తరువాత కమ్మదనం కోసం రెండు స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. లైట్ గా వేగిన తర్వాత చల్లగా అయ్యేంతవరకు పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని కాస్త నీరు వేసి నానబెట్టాలి. తరువాత కాల్చిన వంకాయను పైపొట్టు తీసేసి చేతితో మెత్తగా గుజ్జు లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న రోలు తీసుకొని అందులో మనం వేయించిన పప్పు దినుసులను వేసి మెత్తగా అయ్యేంతవరకు దంచాలి.

ఒకవేళ కావాలనుకుంటే మిక్సీ కూడా వాడొచ్చు కానీ రోలులో దంచినంత టేస్ట్ గా ఉండదు. రోలులో మెత్తగా కాకుండా మామూలుగా దంచిన తర్వాత అందులో 8 వెల్లుల్లిపాయలు, నానబెట్టిన చింతపండును నీళ్లతో సహా వేసుకోవాలి. తగినంత కళ్ళు ఉప్పు, కాస్త కొత్తిమీర వేసి కాస్త దంచిన తర్వాత అందులో వంకాయ గుజ్జుని వేసి మరీ మెత్తగా కాకుండా మామూలుగా దంచుకోవాలి.

తరువాత ఒక బానిలో కొంచెం నూనె వేసి అర స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు ఒక ఎండుమిరపకాయను నాలుగైదు ముక్కలుగా వేసి, కాస్త కరివేపాకులు ఏసి ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఈ వేయించిన పప్పు దినుసులను అందులో వేసి కలుపుకోవాలి. వేడి వేడి అన్నంలో తింటే కమ్మగా ఉంటుంది. కావాలంటే చివరలో ఉల్లిగడ్డ ను ముక్కలు ముక్కలుగా తుంచి వేసుకోవచ్చు. ఇప్పుడు నోరూరించే వంకాయ రోటి పచ్చడి రెడీ.