రుచికరమైన నోరూరించే బ్రెడ్ ఆమ్లెట్ ను తయారు చేసుకునే విధానం!

ఒక గిన్నె తీసుకొని అందులో మూడు కోడిగుడ్లను వేసుకోవాలి. తర్వాత అందులో రెండు స్పూన్ల తరిగిన ఆనియన్ ను వేయాలి. ఒక స్పూన్ తరిగిన పచ్చిమిర్చిని వేసుకోవాలి. తగినంత కళ్ళు ఉప్పును వేసి అంతా కలిసేలా తిప్పుకోవాలి. తరువాత అందులో కాస్త కొత్తిమీర వేసుకోవాలి.అంతా బాగా కలిసేలా స్పూన్ తో తిప్పాలి.

తరువాత ఒక బాణీ తీసుకొని అందులో ఒక స్పూన్ బటర్ వేసి స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లో ఉంచి రెండు బెడ్ ముక్కలను తీసుకొని రెండు వైపులా లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేలా కాల్చుకోవాలి. తరువాత బాణీలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో మనం తయారు చేసుకున్న కోడిగుడ్ల మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా వేయాలి.

వాటిపై మనం కాల్చుకున్న బెడ్ ముక్కలను ఉంచాలి. బెడ్ ముక్కలను ఇంకా ఆమ్లెట్ ను బాణీలో నుంచి తిప్పాలి, అంటే బెడ్ ముక్కలు కిందికి ఆమ్లెట్ పైకి వచ్చే విధంగా తరువాత ఆమ్లెట్ ను నాలుగు వైపుల నుంచి బెడ్డుకు సమానంగా ఉండే విధంగా మడిచి వాటిపై మరో రెండు బెడ్డు ముక్కలను ఉంచాలి.

ఇక వీటికి బాగా గోల్డెన్ కలర్ వచ్చేవరకు బానిలో అటూ ఇటూ తిప్పుతూ వేయించుకోవాలి. ఇక ఇంకేముంది దీనిని తీసుకొని ఒక ప్లేట్లో వేసి సగానికి కట్ చేస్తే మనకు కావలసిన బెడ్ ఆమ్లెట్ రెడీ. చూశారుగా ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉండి మంచి రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ తయారు చేసుకునే విధానం. బయట వాటికి అలవాటు పడి అనారోగ్యం కు గురికాకుండా ఇంట్లోనే ఉండి చక్కగా హెల్తీ ఫుడ్ తయారుచేసుకొని స్నాక్స్ లాగా తినడం ద్వారా ఆరోగ్యం బాగా ఉంటుంది. తప్పకుండా ఇది ట్రై చేయండి.