నిమ్మరసంతో ఇలా చేస్తే ఆనెలకు సులువుగా చెక్.. వాళ్లకే ఆనెలు ఎక్కువగా వస్తాయా?

ఆనెల సమస్య వస్తే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఈ సమస్యతో బాధ పడుతూ ఉంటారో వాళ్లకు నడుస్తుంటే తీవ్రమైన నొప్పి ఉండడంతోపాటు పాదాల కింద చర్మం మంటగా అనిపించే అవకాశాలు అయితే ఉంటాయి. ఇలాంటి సమస్య బారిన పడితే ఓ నిమ్మకాయ తీసుకుని రెండు ముక్కలుగా రసాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి.

ఆనెల మధ్య భాగంలో రసాన్ని అప్లై చేస్తే రోజులకు అక్కడ చర్మం మరింత గట్టి పడి కాయలా రాలిపోయే అవకాశం ఉంటుంది. ఈ చిట్కాను పాటించడం ద్వారా దీర్ఘ కాలంలో ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ సమస్య నుంచి బయట పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మనం కూరల్లో ఉపయోగించే వెల్లుల్లిలో బోలెడన్ని ఔషధ గుణాలు ఉంటాయి.

బ్యాక్టీరియాను నియంత్రించే శక్తి వెల్లుల్లికి ఉండగా వెల్లుల్లి యాంటి ఆక్సిడెంట్లతో పాటు ఫంగస్ పై కూడా పోరాడుతుందని చెప్పవచ్చు. వెల్లుల్లిని పేస్ట్ లా చేసి ఆనెలపై అప్లై చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. వెల్లుల్లి రెబ్బలను పేస్ట్‌గా చేసి ఆనెలు ఉండే చోట ఓ క్లాత్ సహాయంతో కట్టులా కట్టినా ఉపశమనం లభించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.

ఉల్లిపాయల్లో ఉండే కొన్ని రకాల రసాయనాలు ఇన్ఫెక్షన్లపై చక్కగా పోరాడతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఆనెలు రాకుండా చేయడంలోనూ ఉల్లిపాయ సమర్థంగా పని చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయలను గుజ్జుగా చేసుకుని ఆనెలు తీవ్రంగా ఉన్న చోట అపలై చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఉల్లిపాయ రసం ప్రభావంతో చర్మంపై మృత కణాలు తొలగిపోవడమే కాకుండా ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుందని చెప్పవచ్చు.