హాట్ గా నోరూరించే చికెన్ క్రిస్పీ.. ఎలానో చూడండి!

చికెన్ క్రిస్పీ తయారు చేసే ముందు పది నుంచి 12 వరకు తీసుకొని శుభ్రంగా కడిగి స్టౌ పై ఒక బానిలో కొంత నీరు తీసుకొని అందులో ఈ చికెన్ పీసులు వేసి ఒక 30 నిమిషాల పాటు బాగా మరిగించాలి. మరొక బాని తీసుకొని అందులో బంగాళదుంపలను బాగా ఉడికించి పైపొట్టు తీసేసి తడి లేకుండా ఒక గిన్నెలో వేసి స్పూన్ తో మెత్తగా చేసుకోవాలి.

తర్వాత ఉడికించిన చికెన్ పీసులను తీసి ఎముకలను పక్కకు తీసి కత్తితో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ చికెన్ ముక్కలను బంగాళదుంప గుజ్జులో వేసి బాగా కలపాలి. అందులో అరకప్పు కార్న్ ఫ్లవర్ పిండి, తగినంత ఉప్పు, ఒక స్పూన్ కారం, కొద్దిగా బ్లాక్ పెప్పర్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముద్దలాగా చేసుకుని ఇంతకుముందు మనం తీసిన లెగ్ పీస్ ఎముకకు అతికించాలి.

తర్వాత ఒక గిన్నెలో 10 నుంచి 15 వరకు కోడిగుడ్లను వేసి లెగ్ పీస్ కు అంత పట్టేలా అద్దాలి. తరువాత చికెన్ పీస్ ను గిన్నె తీసుకొని అందులో బెడ్ పౌడర్ పిండిలో అద్దాలి. తర్వాత అదే లెగ్ పీస్ ను కోడిగుడ్లలో తర్వాత డెడ్ పౌడర్ లో ముంచాలి. ఇలా రెండుసార్లు చేసినట్లయితే బెడ్డు ఇంకా కోడిగుడ్డు బాగా అతుక్కుంటుంది.

తరువాత ఒక బాణీ తీసుకుని అందులో నూనె వేసి ఈ లెగ్ పీస్ ను అందులో వేసి గోల్డెన్ రంగులోకి వచ్చేవరకు వేయించాలి. తరువాత ఈ లెగ్ పీస్ ను టిష్యూ పేపర్లో వేసినట్లయితే ఆయిల్ ను పేపర్ పీల్చుకుంటుంది. ఇంకేముంది నోరూరించే చికెన్ ఫ్రై ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.