మనలో చాలామందిని ఎక్కువగా వేధించే ఆరోగ్య సమస్యలలో తలనొప్పి ఒకటి. ఈ సమస్య చిన్న సమస్యే అయినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దీర్ఘకాలంలో ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. తరచూ తలనొప్పి వేధిస్తుంటే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం ద్వారా సులువుగా తలనొప్పికి చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. తలనొప్పిని తగ్గించడానికి కొంతమంది ట్యాబ్లెట్స్ పై ఆధారపడతారు.
అయితే తలనొప్పి సమస్యకు చెక్ పెట్టడానికి ఎక్కువగా ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కొన్ని తేలికైన చిట్కాలను పాటిస్తే మాత్రం తలనొప్పి సులువుగా దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సరైన స్థాయిలో నీళ్లను తీసుకోవడం ద్వారా తలనొప్పిని దూరం చేసుకోవచ్చు. తక్కువగా నీళ్లు తీసుకునే వాళ్లను డీ హైడ్రేషన్ సమస్య వేధిస్తుంది.
కొన్ని సందర్భాల్లో డీ హైడ్రేషన్ సమస్య వల్ల మైగ్రేన్, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. మెగ్నీషియం లోపంతో బాధ పడేవాళ్లను మైగ్రేన్, ఇతర సమస్యలు వేధిస్తాయి. డార్క్ చాక్లెట్, నట్స్, తృణ ధాన్యాలు, కూరగాయాలు, ఆకుకూరలు తీసుకోవడం ద్వారా మైగ్రేన్ సమస్య దూరమవుతుంది. తలనొప్పితో బాధ పడేవాళ్లు మాంసం, స్మోక్డ్ ఫిష్, వైన్, బీర్లు, బర్గర్లు, ఛీజ్ కు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు.
నిద్రలేమి సమస్యతో బాధ పడేవాళ్లను సైతం తలనొప్పి సమస్య వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. 6 గంటల కంటే తక్కువ సమయం నిద్రపోతే తలనొప్పి సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సరైన నిద్ర ఉంటే మాత్రమే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. లావెండర్, పెప్పర్ మింట్ అయిల్ తలనొప్పిని దూరం చేయడంలో ఉపయోగపడతాయి.
స్మోకింగ్, ఆల్కహాల్ కు దూరంగా ఉండటం వల్ల తలనొప్పి సమస్య దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాఫీ, టీ తాగితే అందులో ఉండే కెఫీన్ వల్ల తలనొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. అయితే ఎక్కువ మొత్తంలో టీ, కాఫీ తీసుకోవడం ద్వారా లాభం కంటే నష్టం ఎక్కువగా కలిగే అవకాశం అయితే ఉంటుంది.