Home Health & Fitness హ్యాపీ హోలీ..! చిన్న టిప్స్ తో రంగుల రంగేళీ..!!

హ్యాపీ హోలీ..! చిన్న టిప్స్ తో రంగుల రంగేళీ..!!

రంగుల రంగేళీ హోలీ వచ్చేస్తోంది. ఉత్తరాది పండగే అయినా మనలో మమేకమైపోయింది. ప్రతి ఇంటా జరిగే హోలీ సంబరాలు అంబురాన్ని అంటుతాయి. పిల్లా పెద్దా.. అంతా రంగులు అద్దుకుంటూ, రంగు నీళ్ల జల్లుల్లో తడిసిముద్దవుతారు. ఇంతటి సంబరాల్ని ఇస్తుంది హోలీ పండగ. మరి ఈ సమయంలో చర్మం, జుట్టు, ఆరోగ్యంపై రంగుల ప్రభావం పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి. సూర్య కిరణాలు, రంగుల్లో ఉండే హానికరమైన రసాయనాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

Main Qimg D9600B953D271Ea07096A3Ddb2F16A0A | Telugu Rajyam

హోలీ ఆడే సమయంలో..

 • హోలీ ఆడే సమయంలో సూర్య కిరణాల నుంచి రక్షణ అవసరం. అందుకు జెల్, సన్ స్క్రీన్ లోషన్, సన్ గ్లాసెస్ పెట్టుకోవడం, లిప్ బామ్ చేసుకోవడం ఉత్తమం.
 • ముఖానికి ఆల్మండ్, కోకోనట్, ఆలివ్ ఆయిల్స్ లో ఏదొకటి అప్లై చేయాలి. దీనివల్ల రంగుల్ని తొలగించడం సులభమవుతుంది. ఈ ఆయిల్స్ చర్మానికి, రంగులకి మధ్య ప్రొటెక్టివ్ లేయర్లుగా ఉంటాయి.
 • హోలీ సమయంలో కాటన్ దుస్తులు ధరించడం బెటర్.
 • జుట్టుకి నూనె పట్టించడం బెటర్. ఇందులో కొన్ని చుక్కల నిమ్మ రసం కలిపితే రంగుల్లో ఉండే కెమికల్స్ వల్ల ఇన్‌ఫెక్షన్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది.

హోలీ ఆడేశాక..

 • రంగులతో ముద్దైపోయిన చోట బేబీ ఆయిల్, కోకోనట్ ఆయిల్ కానీ రాయండి. స్కిన్ కి అతుక్కున్న పొడి రంగులు తేలికగా వదుల్తాయి. తడి బట్ట లేదా టిష్యూని ఉపయోగించి తుడవాలి.
 • సోప్, ఫేస్ వాష్ యూజ్ చేస్తే స్కిన్ డ్రై గా మారే అవకాశం ఉంది. 
 • పెరుగు, పసుపు, తేనె, శనగపిండి మిశ్రమాన్ని అప్లై చేయొచ్చు. మాయిశ్చరైజర్ రాస్తే స్కిన్ డ్రై గా రఫ్ కాకుండా మృదువుగా ఉంటుంది.
 • ప్రస్తుత పరిస్థితుల్లో ఫేస్ మాస్క్ వాడటం అత్యంత శ్రేయస్కరం.

జుట్టును కాపాడుకోవాలంటే..

 • షవర్ కింద పది నిమిషాలపాటు జుట్టును తడపండి.
 • కెమికల్స్ ఉండని మైల్డ్ నాచురల్, లేదా బేబీ షాంపూని వాడటం ఉత్తమం.
 • తల స్నానం తర్వాత సీరమ్ అప్లై చేసినా జుట్టు మీద రంగులుంటే పోతాయి.
 • గాలికి ఆరనిస్తే మీ జుట్టు మళ్లీ మీకు కనిపిస్తుంది.

గమనిక: ఈ వివరాలన్నీ ఆరోగ్య నిపుణులు ఆయా సందర్భాల్లో చెప్పినవే అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా, సూచనలు, సలహాల కోసం వైద్యులను సంప్రదించడమే ఉత్తమైన మార్గం. గమనించగలరు.

Related Posts

‘మైగ్రేన్’ విముక్తికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ?

మైగ్రేన్... తల పగిలిపోతుందా అన్నట్లుగా, నరాలు చిట్లిపోతున్నాయా అనేంతలా భాదించే తలనొప్పి. సాధారణంగా వచ్చే తల నొప్పికి ఒక కప్పు టీ లేదా ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. కానీ మైగ్రేన్ తరుచుగా...

ఆరోగ్యానికి అమృతం… ‘డ్రాగ‌న్ ఫ్రూట్’ ! ఎందుకో తెలుసా ?

కరోనా వైరస్ కారణంగా ప్రజలలో ఈ మధ్య ఆరోగ్యం, రోగనిరోధక శక్తి మీద అవగాహన పెరిగి ఫ్రూట్స్ వాడకం చాలా ఎక్కువైంది. ఈ క్రమంలోనే 'డ్రాగ‌న్ ఫ్రూట్' ప్రాధాన్యత వాణిజ్యపరంగా బాగా పెరిగింది....

లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే ఉదయాన్నే వీటిని ట్రై చేయండి !

ఒక మంచి వేకువ జాము దినచర్య అనేది ఎంతో మంది విజయ రహస్యంగా భావించవచ్చు. కొన్ని చిన్న చిన్న అలవాట్లే మన లక్ష్యాలను చేధించే ప్రక్రియకు శక్తినిస్తాయి. జీవితంలో ఏదో సాధించాలని అనుకునే...

Related Posts

Latest News