‎Kingdom Movie: కింగ్‌డమ్‌ మూవీ సెలెబ్రేషన్స్.. బాణా సంచాలు పేల్చిన విజయ్.. ఫోటోస్ వైరల్!

‎‎Kingdom Movie: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్‌డమ్‌. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా అనగా జులై 31వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. ‎రివ్యూలన్నీ కూడా పాజిటివ్ గానే వస్తున్నాయి.

‎ పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాను చూసి చిత్ర బృందానికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా విజయ్ హవానే నడుస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ, సత్యదేవ్ ల నటనపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ని చూస్తే తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని అర్థమవుతుంది. అలాగే కలెక్షన్లు కూడా బాగానే వస్తాయి అనిపిస్తోంది. కాగా ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ సాధించిన సందర్భంగా మూవీ మేకర్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు.

https://twitter.com/baraju_SuperHit/status/1950902509675151674?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1950902509675151674%7Ctwgr%5Eeb7dbeca77a6474beac5049392d6ea9d9235059e%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Ftollywood%2Fvijay-devarakonda-kingdom-movie-team-success-celebrations-photos-goes-viral-1594191.html

‎ఈ నేపథ్యంలో విజయ్‌ దేవరకొండ టీమ్ కేక్‌ కట్‌ చేసారు. అనంతరం టపాసులు పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు. సత్యదేవ్‌, నటుడు వెంకటేష్ తో పాటు నిర్మాత నాగవంశీ తదితర చిత్ర బృందం సభ్యులు ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం కింగ్ డమ్ సెలబ్రేషన్స్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ కింగ్ డమ్ సినిమాను నిర్మించారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.