హెచ్ఎంపీవీ ప్రస్తుతం ఎంతోమందిని టెన్షన్ పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ కు సంబంధించి ఈ నెల 6వ తేదీన 5 కేసులు నమోదు కాగా ఈరోజు మాత్రం కొత్త కేసులు నమోదైనట్టు ఎలాంటి అప్ డేట్స్ రాలేదు. అయితే ఈ వైరస్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఈ వైరస్ గురించి వేర్వేరు వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో కొన్ని విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం చైనా దేశంలో ఈ వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తుండటం గమనార్హం. ఈ వైరస్ మానవ శ్వాస వ్యవస్థను దెబ్బ తీసే వైరస్ అని చెప్పడం గమనార్హం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లెక్కల ప్రకారం కర్ణాటక రాష్ట్రంలో ఇద్దరు చిన్నారులు ఈ వైరస్ బారిన పడ్డారు.
ఈ వైరస్ బారిన పడిన వాళ్లు జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి, శ్వాస సంబంధిత సమస్యలతో బాధ పడే అవకాశాలు అయితే ఉంటాయి. 2001 సంవత్సరంలోనే శాస్త్రవేత్తలు ఈ వైరస్ ను కనుగొన్నారు. ఈ వైరస్ మరీ ప్రాణాపాయం కాదని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవాళ్లు న్యూమోనియా బారిన పడి ఆస్పత్రిలో చేరే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఈ వైరస్ కు చికిత్స అందించే ప్రత్యేక యాంటీ వైరల్ మందులు అందుబాటులో లేవు. మాస్క్ ధరించి చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవాళ్లు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు ఈ వైరస్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.