ప్రస్తుత కాలంలో నడుమునొప్పి సమస్య వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. నడుమునొప్పికి చికిత్స కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. విపరీతమైన నడుమునొప్పితో బాధ పడేవాళ్లు కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు. నడుము నొప్పికి ఎక్కువగా మందులను వాడటం కంటే జీవనశైలిని మార్చుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
వెన్నెముక కండరాలు బలోపేతం చేయడంతోపాటు, కొన్ని రోజువారీ అలవాట్లను మార్చుకోవడం ద్వారా నడుమునొప్పి సమస్య దూరమవుతుంది. నడుంనొప్పి ఎక్కువగా ఉన్నవారు మోకాళ్ళ కింద దిండు పెట్టుకొని నిద్రించడం వల్ల, కాళ్ళు ఎత్తుగా పెట్టడం వల్ల నడుంపై ఒత్తిడి తగ్గి కాస్త ఉపశమనం కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కండరాలను సాగదీసే స్ట్రెచ్ ఎక్సర్సైజులు చేయడంవల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
ఎముకలు బలంగా ఉన్నప్పుడు నడుము నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా బాధించే అవకాశం అయితే ఉండదు. కాల్షియం మరియు విటమిన్ డి పుష్కలంగా తీసుకోవడం ద్వారా మీ వెన్నెముకలోని ఎముకలకు బలం చేకూరే అవకాశాలు అయితే ఉంటాయి. పాలు, పెరుగు, ఆకుకూరలు, విటమిన్ సప్లిమెంట్లు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
తక్కువ మడమ ఉన్న చెప్పులను ధరించడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. విపరీతమైన బరువు వల్ల కూడా చాలామంది నడుము నొప్పితో ఇబ్బందులు పడుతూ ఉంటారు. చిన్న చిన్న మార్పులతో నడుం నొప్పి ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలను పొందుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు.