ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని పైల్స్ సమస్య వేధిస్తోంది. ఈ సమస్య వల్ల కొంతమంది సరిగ్గా కూర్చోవడానికి సైతం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్యతో బాధ పడే వాళ్లు కొన్ని ఆహారాలకు దూరంగా ఉంటే ఆరోగ్యానికి మంచిది. జీవనశైలిలో మార్పులు, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్లే ఎక్కువమంది ఈ సమస్య వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు.
ఇవి నొప్పి, బాధను కలిగించడంతో పాటు కొన్నిసార్లు రక్తస్రావం కూడా జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. నాన్ వెజ్ ఎక్కువగా తీసుకున్నా జంక్ ఫుడ్ ఎక్కువగా తిన్నా అధిక బరువు సమస్యతో బాధ పడుతూ ఉన్నా పైల్స్ సమస్య వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ సమస్యతో బాధ పడే వాళ్లు రోజుకు కనీసం 4 లీటర్ల నీటిని తాగాలి. కారం, మసాలాలు, జంక్ ఫుడ్స్ కు వీలైనంత దూరంగా ఉండాలి.
ఉదయం సమయంలో యోగా చేయడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. ఈ సమస్యతో బాధ పడేవాళ్లు పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. అరటిపండ్లు తినడంతో పాటు పెరుగును ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఫైబర్ పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి.
చింతపండు, పచ్చళ్లకు దూరంగా ఉండటం ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చు. ఎఫెక్టెడ్ ఏరియాలో కలబంద గుజ్జు అప్లై చేయడం ద్వారా ఈ సమస్య దూరమవుతుంది. కొబ్బరినూనెను ఎఫెక్టెడ్ ఏరియాలో అప్లై చేయడం ద్వారా కూడా సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఐస్ ప్యాక్ అప్లై చేయడం ద్వారా కూడా ఈ సమస్య నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుంది.