చలికాలంలో చాలామంది జలుబు, దగ్గు వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. కొంతమంది సరైన చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెడితే మరి కొందరు ఎంత కష్టపడినా ఈ సమస్య వల్ల ఇబ్బందులు పడుతుంటారు. దగ్గు, జలుబు వల్ల తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు తగ్గుతుండగా ఎక్కువమందిని వేర్వేరు వ్యాధులు వేధిస్తున్నాయి. మిరియాలను డైరెక్ట్ గా తీసుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
జలుబు, దగ్గు వేధిస్తుంటే స్వచ్చమైన తేనె తీసుకుంటే మంచిది. తేనె తీసుకోవడం ద్వారా త్వరగా ఉపశమనం లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అల్లం తీసుకోవడం ద్వారా కూడా ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఉప్పునీటి ద్రావణాన్ని బాగా పుక్కిలించడం ద్వారా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. వెల్లుల్లి రెబ్బలను వెయించి తేనె తో కలిపి తీసుకుంటే మంచిది.
ఊపిరితిత్తులకు సోకే వైరస్ ల వల్ల దగ్గు, జలుబు వేధించే అవకాశం అయితే ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవాళ్లు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. చలికాలంలో పెరుగుకు వీలైనంత దూరంగా ఉంటే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు. చలికాలంలో డ్రై ఫ్రూట్స్ తీసుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. తులసి తమలపాకు తీసుకోవడం ద్వారా కూడా జలుబు, దగ్గు దూరమవుతాయి.
బెల్లం తీసుకోవడం ద్వారా కూడా జలుబు, దగ్గు దూరమవుతాయని చెప్పవచ్చు. సిట్రస్ పండ్లు తీసుకోవడం ద్వారా దగ్గు, జలుబు దూరమయ్యే ఛాన్స్ ఉంటుంది. వాము, దాల్చిన చెక్క తీసుకుంటే కూడా జలుబు, దగ్గుకు చెక్ పెట్టవచ్చు. ఆవాల నూనె వాసన చూడటం ద్వారా కూడా దగ్గు, జలుబు దూరమవుతాయి. జీలకర్రను వేయించి వాసన పీల్చుకుంటే మంచిది. ఉల్లిపాయను దంచి చూస్తే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.