మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో చియా విత్తనాలను తినే ఉంటారు. చియా విత్తనాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకురుతాయని చెప్పవచ్చు. చియా సీడ్స్ తినడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు లభించే అవకాశాలు అయితే ఉంటాయి. రక్తంలో చక్కెర నిర్వహణను మెరుగుపరచడంలో ఇవి సహాయపడతాయి. గుండె సమస్యలకు, బరువు తగ్గడానికి, బలమైన ఎముకలను నిర్మించడానికి చియా సీడ్స్ తోడ్పడతాయి.
చియా సీడ్స్ తీసుకోవడం ద్వారా సులువుగా బరువు తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆకలి కోరికలను అధిగమించడంలో ఇది తోడ్పడుతుంది. చియా గింజలు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన ఫైబర్, గుండె-ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు లభించే అవకాశాలు అయితే ఉంటాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడంలో ఇవి సహాయపడతాయి.
కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలను అదుపులో ఉంచడంతో పాటు ఆక్సీకరణ స్థాయిలను తగ్గించడంలో చియా విత్తనాలు సహాయపడతాయి. చియా విత్తనాలు కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం లాంటి ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటాయి. బోలు ఎముకల వ్యాధి వంటి ఎముక సంబంధిత చికిత్సల విషయంలో ఇవి సహాయపడతాయి. ఈ గింజల్లో ఉండే ఆల్ఫా-లిపోయిక్ యాసిడ్ ఎముక ఖనిజ సాంద్రతను పెంచడంలో ఎంతగానో తోడ్పడుతుంది.
చియా సీడ్స్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది. మొటిమలను తగ్గించడంతో పాటు కణజాల మరమ్మత్తు చేయడంలో ఇవి తోడ్పడతాయని చెప్పవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో చియా సీడ్స్ ఉపయోగపడతాయని చెప్పవచ్చు. చియా గింజలతో కూడిన బ్రెడ్ తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది.