సీనియర్ సిటిజన్స్ కి హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ అదిరిపోయే ఆఫర్.. ఇకపై వడ్డీ రేట్లు పెంపు..?

hdfc-kZOG--621x414@LiveMint_1631776387930

ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ తాజాగా ఫెస్టివల్స్ కి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఎన్నో స్కీమ్స్ ద్వారా కస్టమర్లకు ఎన్నో ప్రయోజనాలు అందిస్తోంది. ఇక తాజాగా సీనియర్ సిటిజన్స్‌ డిపాజిట్ పథకాలపై వడ్డీ రేట్లను పెంచింది. ముఖ్యంగా డైమండ్ డిపాజిట్ పథకంపై 8 శాతం వరకు వడ్డీ రేటును పెంచినట్లు హెచ్డిఎఫ్సి వెల్లడించింది. పెరిగిన ఈ వడ్డీ రేట్లు మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చాయి..ఇక ఈ బ్యాంక్ సెఫైర్‌ డిపాజిట్స్, స్పెషల్ డిపాజిట్స్, ప్రీమియం డిపాజిట్స్, రెగ్యులర్ డిపాజిట్స్ వంటి స్కీమ్స్ సీనియర్ సిటీజన్స్ కోసం ప్రవేశపెట్టింది. అయితే ఈ బ్యాంకు వడ్డీ రేట్లు అనేవి కస్టమర్లు తీసుకొనే ప్లాన్స్, టైమ్ పిరియడ్ ను బట్టి ఉంటాయి.

* డైమండ్ డిపాజిట్ : హెచ్డిఎఫ్సి బ్యాంక్ డైమండ్ డిపాజిట్స్‌ను సీనియర్ సిటిజన్స్‌కు మాత్రమే ఆఫర్ చేస్తోంది. డిపాజిట్ కింద వడ్డీ రేట్లు ఇన్‌కమ్ ప్లాన్‌పై ఆధారపడి ఉంటాయి. 75 నెలల కాలవ్యవధితో ఇన్‌కమ్ ప్లాన్స్ నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక, క్యూములేటివ్‌ పై వడ్డీ రేట్లు వరుసగా.. 7.70%, 7.75%, 7.80%, 8.00%, 8.00% గా ఉన్నాయి..

* ప్రీమియం డిపాజిట్ : ఈ డిపాజిట్ ప్లాన్ మూడు టెన్యూర్స్ 15, 22, 44 నెలలుగా ఉంటుంది. వడ్డీ రేటు ప్లాన్‌పై ఆధారపడి ఉంటుంది. 15 నెలల టెన్యూర్‌పై వడ్డీ రేట్లు 7.20% నుంచి 7.45% మధ్య ఉంటాయి. 22, 44 నెలల టెన్యూర్స్‌పై 7.25% నుంచి 7.50% మధ్య వడ్డీ రేట్లు ఉన్నాయి.

• స్పెషల్ డిపాజిట్ : ఈ డిపాజిట్ ప్లాన్‌ రెండు టెన్యూర్స్‌గా ఉంటుంది. ఒకటి 33 నెలలు, మరోటి 66 నెలలు. 33 నెలల కాలవ్యవధి నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక, క్యూములేటివ్‌ ఇన్‌కమ్ ప్లాన్స్‌పై వడ్డీ రేట్లు వరుసగా 7.30%, 7.35%, 7.40%, 7.55%, 7.55%గా ఉన్నాయి. 66 నెల టెన్యూర్ పై వడ్డీ రేట్లు వరుసగా 7.40%, 7.45%, 7.50%, 7.65%, 7.65% గా ఉన్నాయి.

• సెఫైర్‌ డిపాజిట్ : ఇందులో పెట్టుబడి పెట్టేవాళ్ళు.. ప్లాన్ మోడ్‌ను బట్టి 7.45% నుంచి 7.70% మధ్య వడ్డీని పొందుతారు. ఈ స్కీమ్ కాలపరిమితి 45 నెలలు. నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక, క్యూములేటివ్‌ ఇన్‌కమ్ ప్లాన్స్‌పై వడ్డీ రేట్లు వరుసగా 7.45%, 7.50%, 7.55%, 7.70%, 7.70%గా ఉన్నాయి.