లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి అందిస్తున్న భీమా పథకాలలో ఎంతోమంది తమ డబ్బుని ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎల్ఐసి బీమా తీసుకున్న ప్రతి ఒక్కరూ తమ పాలసీకి పాన్ కార్డు తప్పనిసరిగా లింక్ చేయాలని ఎల్ఐసి ప్రకటన విడుదల చేసింది. పాలసీదారులు మార్చి 31వ తేదీలోగా తమ పాలసీని పాన్ కార్డ్ తో తప్పనిసరిగా లింక్ చేయాలని లేకపోతే భవిష్యత్తులో పాలసీ విషయంలో అనేక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందని ఎల్ఐసి వెల్లడించింది. అయితే ఇప్పటివరకు పాలసీని పాన్ కార్డుతో లింక్ చేయని వారు ఆన్లైన్లో కూడా పాన్ కార్డుతో పాలసీని లింక్ చేసే అవకాశం ఉంది . ఎల్ఐసి పాలసీని పాన్ కార్డుతో ఎలా లింక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ ఎల్ఐసి పాలసీ స్టేటస్ గురించి తెలుసుకోవటానికి ముందుగా LIC ఇండియా అధికారిక వెబ్సైట్ ని పాలసీ కొనుగోలుదార్లు సందర్శించాలి. లేదా, https://linkpan.licindia.in/UIDSeedingWebApp/getPolicyPANStatus లింక్ ద్వారా నేరుగా ఆ వెబ్ పేజీలోకి వెళ్లవచ్చు.
https://linkpan.licindia.in/UIDSeedingWebApp/getPolicyPANStatus లింక్ ని కాపీ చేసి, దానిని గూగుల్ అడ్రస్ బార్లో లేదా సెర్చ్ బార్లో పేస్ట్ చేసి ఎంటర్ నొక్కండి.
• ఇక ఇప్పుడు, అక్కడ మీ పాలసీ నంబర్ నమోదు చేయండి.
• ఆ తర్వాత మీ పుట్టిన తేదీ,వయసు వంటి మీ వివరాల గురించి సమాచారాన్ని పూరించండి.
• ఆ తర్వాత అక్కడ పాన్ కార్డ్ వివరాలను నమోదు చేయండి. ఆపై క్యాప్చా (Captcha) నింపండి .
• ఇక ఇప్పుడు, మీరు నింపిన వివరాలన్నీ మరోసారి సరి చూసుకుని సబ్మిట్ (Submit) బటన్ మీద ప్రెస్ చేయండి. ఇప్పుడు PAN లింక్ సమాచారం మీకు కనిపిస్తుంది.
• ఒకవేళ మీ పాన్ కార్డ్ ఎల్ఐసీ పాలసీకి లింక్ కాకపోతే, https://licindia.in/Home/Online-PAN-Registration లింక్లోకి వెల్లి ఇక్కడ కనిపించే ప్రొసీడ్ బటన్ నొక్కండి
• ఇప్పుడు మరొక పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ పుట్టిన తేదీని నింపండి.
• ఆ తర్వాత జెండర్ (ఆడ లేదా మగ) మీద క్లిక్ చేయండి.
• ఇప్పుడు మీ పాన్ నంబర్ నింపండి. ఆ తర్వాత గడిలో, పాన్ మీద ఉన్న రీతిలోనే మీ పేరును ఎంటర్ చేయండి.
• ఆ తర్వాత మీ మొబైల్ నంబర్, పాలసీ నంబర్, క్యాప్చా కోడ్ నమోదు చేయండి.
• ఇక ఇప్పుడు, ‘GET OTP’ బటన్ మీద క్లిక్ చేయండి. మీ మొబైల్ నంబర్ కి వచ్చిన OTPని ఎంటర్ చేసి ఆ తర్వాత సబ్మిట్ బటన్ మీద ప్రెస్ చేయండి.
ఇక ఇప్పుడు మీ LIC పాలసీ పాన్ కార్డ్ కి లింక్ అవుతుంది.