భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు చిలిపి తగాదాలు సర్వ సాధారణమైనవే. కొన్ని క్షణాల్లోనే ఈ తగాదాలు సమిసిపోతాయి. ఒక్కోసారి ఇద్దరి మధ్య సరైన అవగాహన లోపించినప్పుడు, ఈగో ఫీలింగ్స్ ఎక్కువైనప్పుడు ఇద్దరి మధ్య గొడవలు తార స్థాయికి చేరి కొన్ని నెలలు పాటు ఇద్దరి మధ్య దూరం పెరిగి మాటల్లేకుండా గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పొరపాట్లు మీరు అస్సలు చేయకండి. ఇద్దరి మధ్య మౌనం ఎక్కువ రోజులు కొనసాగితే మీ రిలేషన్ కు అంత మంచిది కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తినప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను పాటిస్తే ఇద్దరి మధ్య దూరం తగ్గి సంతోషకరమైన జీవితాన్ని గడపొచ్చు. ఏదో కారణంతో గొడవ జరిగినప్పుడు ఒకరినొకరు మాట్లాడుకోవడానికి చూసుకోవడానికి కొంత ఇబ్బంది ఉండొచ్చు అలాంటప్పుడు ఒక చిన్న మెసేజ్ ఇద్దరి మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. ఇద్దరి మధ్య దూరం మరింత ఎక్కువైనప్పుడు మీలో ఎవరో ఒకరు ఈగో ఫీలింగ్స్ పక్కనబెట్టి ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేస్తే మంచిది.
ఇద్దరి మధ్య గొడవలకు కారణాన్ని తెలుసుకొని దాన్ని సరి చేసుకునే ప్రయత్నంలో వీలైతే క్షమాపణ కూడా కోరవచ్చు. మీ లైఫ్ పార్టనర్ మీతో మాట్లాడకుండా ఉన్నప్పటికీ మీరు తరచూ మాట్లాడే ప్రయత్నం చేయండి అప్పుడే ఇద్దరి మధ్య దూరం తగ్గుతుంది. ఎవరి దారి వారు చూసుకుంటే మీ బంధం మరింత బలహీనంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది
ఇద్దరి మధ్య మాటలు లేని సమయంలో అవతలి వ్యక్తికి ఇష్టం లేని పనులు అస్సలు చేయకండి. మీకు సమయం దొరికినప్పుడు మీ లైఫ్ పార్టనర్ తో ఏకాంతంగా గడపడానికి ఎక్కువ సమయం కేటాయించండి. వీలైనప్పుడల్లా సినిమా, షాపింగ్, రెస్టారెంట్ వంటి ప్రదేశాలకు వెళ్లి సరదాగా గడిపితే మనసులోని ఆలోచనలన్నీ తొలగిపోతాయి. చిన్న విషయాలకే గట్టిగా అరవడం, కోపం తెచ్చుకోవడం, చేయి చేసుకోవడం వంటి అలవాట్లను తక్షణమే మానుకోవాలి.